నేడు జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత మహిళల జట్ల మధ్య జరుగుతున్న 2020 టీ - 20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ని ప్రారంభించి  భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా ఓపనర్లు ఇద్దరూ ఎక్కడ తడబడకుండా వందకు పైగా పరుగులతో మొదటి వికెట్ కు భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా అలైస్స హీలీ ఆకాశమే హద్దుగా తనదైన శైలిలో భారత బౌలర్లను ఊచకోత కోసింది. అదిరిపోయే ఆరంభించిన ఆస్ట్రేలియా నిర్ణిత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.

 

 

ఆ తర్వాత గెలుపు కోసం భారత టీం 185 పరుగుల లక్ష్యంతో దిగగా ఎక్కడ కూడా  ఆస్ట్రేలియా బౌలర్లకు ఎదురు నిలవలేదు. పదునైన బంతులతో ఆస్ట్రేలియా బౌలర్లు భారత బ్యాత్రాలను కోలుకోలేని దెబ్బ తీశారు. మొదటి ఓవర్ లోనే భారత్ ఆశల్ని కోల్పోయింది. స్టార్ బ్యాట్స్ ఉమెన్ షఫాలీ వెర్మ కేవలం మూడు బంతుల్లో రెండు పరుగులు చేసి వెను తిరిగింది.

 


ఇక అక్కడి నుంచి మొదలైన పతనం మళ్ళీ ఎక్కడ పుంజుకున్నట్టు కనిపించలేదు. దీనితో భారత మహిళల జట్టు కేవలం 99 పరుగులకే కట్టడి చేయగలిగారు. దీనితో 85 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఐదోవసారి టీ - 20 విశ్వవిజేతగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: