బంగ్లాదేశ్ వన్డే జట్టుకు సీనియర్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ను కెప్టెన్ గా వ్యవహరించనున్నాడని బంగ్లా క్రికెట్ బోర్డు (బిసిబి)  కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. కొద్దీ రోజుల క్రితం జింబాబ్వే తో జరిగిన మూడో వన్డే తరువాత కెప్టెన్సీ బాధ్యతల నుండి సీనియర్ ఫాస్ట్ బౌలర్ మష్రాఫె మోర్తజా వైదొలగడం తో బోర్డు నూతన సారథిగా తమీమ్ ను నియమించింది. ఏప్రిల్ 1నుండి పాకిస్థాన్  తో జరుగనున్న వన్డే సిరీస్ తో కెప్టెన్ గా తమీమ్ శకం ఆరంభం కానుంది. మరి సారథిగా తమీమ్ మెప్పిస్తాడో లేదో చూడాలి. 2007 లో జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో వన్డే ల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమీమ్ ఇక్బాల్ ఇప్పటివరకు ఈ ఫార్మట్ లో 7202 పరుగులు చేసి బంగ్లా తరుపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానం లో కొనసాగుతున్నాడు. 
 
 
ఇక ప్రస్తుతం సొంత గడ్డపై జింబాబ్వే తో టీ 20 సిరీస్ లో తలపడేందుకు బంగ్లా సన్నద్ధం అవుతుంది. రెండు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 రేపు జరుగనుంది. ఇప్పటికే  జింబాబ్వే తో జరిగిన వన్డే సిరీస్ ను బంగ్లా  3-0 తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: