భారత మహిళా జట్టు యువ ఓపెనర్ షఫాలీ వర్మ టీ 20 ల్లో తన నెంబర్ 1 ర్యాంక్ ను కోల్పోయింది. టీ 20ప్రపంచ కప్ ఫైనల్ ముందు వరకు అగ్ర స్థానం లో కొనసాగిన షఫాలీ ఫైనల్ లో విఫలం కావడంతో రెండు స్థానాలు దిగజారి 730 పాయింట్ల తో మూడో స్థానం లోకి పడిపోయింది. ఇక ఆదివారం జరిగిన ఫైనల్ లో 78 పరుగులతో అజేయంగా నిలిచిన ఆసీస్ ఓపెనర్ మూనీ 779పాయింట్ల తో మూడో స్థానం నుండి రెండు స్థానాలు ఎగబాకి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ టోర్నీ లో మొత్తం 6 మ్యాచ్ ల్లో 259 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్ గా నిలవడం తో మూనీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ లభించింది. 
 
ఇక టీమిండియా మరో ఓపెనర్ స్మృతి మందాన 694 పాయింట్ల తో 6వ స్థానం నుండి ఏడో స్థానానికి పడిపోగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ వుమెన్ రోడ్రిగస్ 643పాయింట్ల తో 9వ ర్యాంక్ లో కొనసాగుతుంది. వుమెన్ టీ 20 బౌలర్ల  ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్ సోఫీయ ఎక్క్లస్టన్ 779 పాయింట్ల తో మొదటి స్థానం లో ఉండగా ఆసీస్ బౌలర్ మేగాన్ షట్ 763 పాయింట్ల తో రెండో స్థానం లో కొనసాగుతుంది. టీమిండియా బౌలర్లు దీప్తి శర్మ,రాధా యాదవ్, పూనమ్ యాదవ్ 6, 7,8 ర్యాంక్ లను దక్కించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: