రెండు రోజుల్లో ప్రాంభమయ్యే భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న కేవలం 3 వన్డేల సిరీస్‌ లో భాగంగా ఆటగాళ్లు క్రికెట్ సంప్రదాయాన్ని కాస్త పక్కన పెట్టే ఆలోచనలు  కనిపిస్తున్నాయి. మాములుగా అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు షేక్‌ హ్యాండ్స్ ఇచ్చుకోవడం మాములే... కానీ, ప్రస్తుతం భారత్‌ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో వన్డే సిరీస్‌ లో భారత్ ఆటగాళ్లతో కరచాలనంపై ఆలోచిస్తున్నట్లు దక్షిణాఫ్రికా టీమ్ చీఫ్ కోచ్ మార్క్ బౌచర్ తెలిపాడు. కాకపోతే భారత్‌ లో ఇప్పటికే సరాసరి 40 మందికిపైగా కరోన్ వైరస్ సోకింది.

 

 


అలాగే దాదాపు మూడు వేల మందిని అనుమానితులని గుర్తించి శాంపిల్స్‌ ని తీసుకొని వారిని ఆసుపత్రులకు పరిమితం చేశారు. ఈ పరిస్థితులలో సిరీస్‌ కోసం భారత్‌ కి బయల్దేరే ముందు దక్షిణాఫ్రికా ఆటగాళ్లకి వైద్య సిబ్బందితో కరోనా వైరస్‌ పై పూర్తి అవగాహన కల్పించారు. ఆటగాళ్లతో పాటు ఒక మెడికల్ టీం కూడా క్రికెట్ జట్టుతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ గడ్డపై అడుగుపెట్టనున్న దక్షిణాఫ్రికా జట్టు వైద్య సిబ్బంది అంచనాలకి అనుగుణంగానే టూర్‌ లో అదే విధంగా చీఫ్ కోచ్ మార్క్ బౌచర్ తెలిపారు.

 

 

అయితే మూడు వన్డేల ఈ సిరీస్‌ లో తొలి మ్యాచ్ ధర్మశాల వేదికగా మార్చి 12న ఆడుతుండగా, ఆ తర్వాత 15 వ తేదీన లక్నో వేదికగా రెండో వన్డే జరుగుతుంది. ఇక ఆఖరి  మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా 18న జరగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: