క్రికెట్ లో  మహేంద్రసింగ్ ధోని కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత మంది క్రికెటర్లు ఉన్న మహేంద్రసింగ్ ధోని కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. టీమిండియాకు 2 ప్రపంచకప్ను అందించిన సూపర్ కెప్టెన్ గా  మహేంద్ర ధోనీ కెప్టెన్సీని  భారత ప్రేక్షకుల మరువలేరు. అంతేకాకుండా సూపర్ ఫినిషర్ అని కూడా ధోనికి  పేరున్న విషయం తెలిసిందే. ఓడిపోయే మ్యాచ్ లను  కూడా సూపర్ ఫినిషింగ్ ఇచ్చి... విజయతీరాలకు చేర్పించ కల సత్తా  మహేంద్ర సింగ్ ధోనీ సొంతం. ఇలా గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా జట్టును విజయతీరాలకు ఎన్నోసార్లు నడిపించాడు మహేంద్రసింగ్ ధోని. సాధారణ పరిస్థితుల్లో కంటే క్లిష్ట పరిస్థితుల్లో చెలరేగి ఆడటంతో ధోని సిద్ధహస్తుడు. 

 

 

 గడ్డు  పరిస్థితుల్లో సిక్సర్ల మోత మోగిస్తూ భారత జట్టు ఓడిపోతుంది అని నిరాశతో ఉన్న అభిమానుల్లో  కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాడు. అందుకే టీమ్ ఇండియా లో ఎంత మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ మహేంద్రసింగ్ ధోని బెస్ట్ ఫినిషర్ అని అంటున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు హెడ్  కోచ్  కూడా అదే చెబుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకి ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ లాంటి ఫినిషర్  కావాలి అంటూ ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాలో ఇటీవలే ముగిసిన మూడు వన్డేల సిరీస్ లో... ఆస్ట్రేలియా ఓటమికి కారణం సరైన ఫినిషర్ లేకపోవడమేనని ఆస్ట్రేలియా జట్టు కోచ్ అంగీకరించాడు.  ఆస్ట్రేలియా జట్టులో ప్రస్తుతం ధోనీ లాంటి ఫినిషర్ ను  అన్వేషించాల్సిన సమయం వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. 

 

 

 అయితే ఆస్ట్రేలియా జట్టు ఆడిన మూడు వన్డేల సిరీస్ లో  భాగంగా మైదానంలోకి వచ్చిన మిచెల్ మార్ష్   32 36 పరుగుల తో సరిపెట్టాడు. ముఖ్యంగా మ్యాచ్ ఫినిషర్ పాత్ర  సరిగ్గా నిర్వర్తించ లేక పోయాడు. అయితే ఆస్ట్రేలియా జట్టులో గతంలో మైక్ హస్సీ మైకేల్ బేవాన్  రూపంలో ఇద్దరు మెరుగైన ఉండేవారు. వారిద్దరూ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మ్యాచ్లను తమవైపు తిప్పుకోవడం లో మంచి సిద్ధహస్తులు. ప్రస్తుత తరంలో మాత్రం ధోని మ్యాచ్ ను  ముగించడం లో సిద్ధహస్తుడు. ప్రతి జట్టులో ఒక ఫినిషర్ టీంలో ఉండాలని అందుకే ఆస్ట్రేలియా కూడా ఆ దిశగా అడుగులు వేయాలని అంటూ జట్టు కోచ్ సూచించాడు. టీమ్ ఇండియా అన్ని  వదిలేసిన ఎన్నో మ్యాచ్ లను ధోని సూపర్ ఫినిషింగ్ తో  గెలిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ బాధ్యతను కె.ఎల్.రాహుల్ నిర్వర్తిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: