స్మృతి మంధానా... ఈ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు భారతదేశంలో. దీని కారణం ఆమె ఆడే ఆటతీరు.  కానీ, ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ లో నిరాశపరిచిన భారత ఓపెనర్ స్మృతి మంధానా క్రికెట్ అభిమానులకి క్షమాపణలు చెప్పింది. మొత్తానికి సిరీస్ మొదట్లో భారీ అంచనాల నడుమ టోర్నీలో ఆడిన స్మృతి మొత్తం నాలుగు మ్యాచ్‌ ల్లో కలిపి కేవలం 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

 

 

అందులో ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ లో మంధానా కేవలం 11 పరుగులకే అవుట్ అవ్వడంతో భారత టీంని ఒత్తిడిలోకి పడేసింది. దీని ఫలితంగా భారత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి 85 పరుగుల తేడాతో ఓడి కప్ ఆస్ట్రేలియా వశమైంది. నిజానికి ఫైనల్ మ్యాచ్‌ ని చూసేందుకు స్టేడియానికి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు. అలాగే టోర్నీ ప్రారంభం నుంచి టీంకి లక్షలాది మంది ఫ్యాన్స్ మద్దతుగా టీమిండియాకి నిలిచారు. 

 

 


కాకపోతే ఫైనల్ మ్యాచ్‌ ని గెలవలేకపోయినందుకు మమల్ని క్షమించాలి అని కోరింది. మ్యాచ్‌ ఓడినప్పటికీ వివిధ వర్గాల నుంచి టీమిండియాకు పెద్ద సంఖ్యలో భారీగా మద్దతు లభించింది అని ఆమె చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: