ఆసియా ఎలెవన్ , వరల్డ్ ఎలెవన్ జట్ల  మధ్య బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలనుకున్న రెండు టీ 20 లు వాయిదా పడ్డాయి. దానికి కారణం కరోనా వైరస్...  ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. దీని దెబ్బ ప్రతి రంగం పై పడుతుంది. తాజాగా క్రికెట్ ను కూడా  వదిలిపెట్టలేదు. జన సమూహం వున్న చోట ఈ వైరస్ తొందరగా వ్యాప్తి చెందే అవకాశం వుండడం తో ఇలాంటి సమయం లో మ్యాచ్ లను నిర్వహించి రిస్క్ చేయలేమని బీసీబీ ఆ రెండు టీ 20 లను వాయిదా వేసింది. ఈ విషయాన్ని కొద్దీ సేపటి క్రితం బంగ్లా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.   
 
బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ శత జయంతి సందర్భంగా  బీసీబీ మార్చి21 అలాగే 22 న ఆసియా ఎలెవెన్ మరియు వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య మిర్పూర్ లోని షేర్ -ఏ- నేషనల్ స్టేడియంలో  రెండు టీ 20 మ్యాచ్ లను నిర్వహించాలనుకుంది. అందులో  భాగంగా ఆటగాళ్ల ఎంపిక కూడా జరిగిపోయింది. టీమిండియా నుండి ఆసియా ఎలెవన్ తరపున కోహ్లీ, రాహుల్, ధావన్, పంత్ , కుల్దీప్ , షమి ఎంపికైయ్యారు.  వీరిలో నలుగురు తుది జట్టులో ఉంటారని బీసీబీ స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు అసలు మ్యాచ్ ల నిర్వహణ లేకుండా చేసి కరోనా, బీసీబీ ఆశల పై నీళ్లు చల్లింది. మరి ఈమ్యాచ్ లను మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: