బుధవారం ఢాకా వేదికగా జరిగిన రెండో టీ 20 లో జింబాబ్వే పై బంగ్లాదేశ్ 9వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని సాధించి రెండు టీ 20ల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. రెండో టీ 20 లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్ల లో 7 వికెట్ల నష్టానికి కేవలం 119పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ బ్రెండన్ టేలర్ (59) రాణించినా మిగితా బ్యాట్స్ మెన్ సహకారం అందించడం లో విఫలమయ్యారు. దాంతో జింబాబ్వే తక్కువ స్కోర్ కే పరిమితం కావాల్సి వచ్చింది. బంగ్లా బౌలర్ల లో ముస్తాఫిజుర్ 2, ఆల్ అమిన్ 2 వికెట్లు తీయగా సైఫుద్దీన్, మెహదీ హాసన్ , అఫిఫ్ తలో వికెట్ తీసుకున్నారు. 
 
 అనంతరం స్వల్ప లక్ష్యం తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు లిటన్ దాస్(60*), నయీమ్ (33) అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా చివర్లో నయీమ్ ఓటైనా సౌమ్య సర్కార్ తో కలిసి లిటన్ దాస్ మ్యాచ్ ను 15.5 ఓవర్లోనే ముగించేశాడు. ఈ సిరీస్ లో వరుసగా  రెండు హాఫ్ సెంచరీలు చేసిన లిటన్ దాస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తోపాటు సిరీస్ కూడా లభించింది. కాగా దాస్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రావడం వరుసగా ఇది రెండో సారి.. ఇటీవల జింబాబ్వే తో జరిగిన వన్డే సిరీస్ లో తమీమ్ ఇక్బాల్ తో కలిసి అతను ప్లేయర్ ఆప్ ది సిరీస్ ను షేర్ చేసుకున్నాడు. ఇక  ఈపర్యటన లో ఆతిథ్య జట్టు తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో ఓటమిపాలైన జింబాబ్వే ఆతరువాత వన్డే  తాజాగా టీ 20 సిరీస్ లలో వైట్ వాష్ కు గురైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: