మూడు వన్డేల సిరీస్ లో భాగంగా గురువారం, భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి వన్డే (డే/నైట్) ధర్మశాల లో జరుగనుంది. అయితే ఈమ్యాచ్ కు వరణుడు అడ్డంకిగా మారే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఎందుకంటే గత రెండు రోజుల నుండి ధర్మశాల లో  వర్షం కురవగా మ్యాచ్ జరుగనున్న రోజు కూడా 90శాతం వర్షం పడే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. ప్రస్తుతం మైదానం మొత్తాన్ని కవర్ల తో కప్పివుంచారు. ఒకవేళ మ్యాచ్ రోజు వర్షం పడ్డా రెండు గంటల్లో గ్రౌండ్ ను సిద్ధం చేస్తామని హెచ్ పి సి ఏ అధికారి ఒకరు తెలియజేశారు. 
 
ఇక జట్ల విషయాని వస్తే వరల్డ్ కప్ తరువాత  వన్డే ఫార్మట్ కు దూరంగా వున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఈమ్యాచ్ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు అతని తోపాటు ధావన్ ,భువనేశ్వర్ లు కూడా పునరాగమనం చేయనున్నారు. మరోవైపు నూతన సారథి డికాక్ నేతృత్వం లోని సౌతాఫ్రికా జట్టు కూడా బలంగానే కనిపిస్తుంది. ఇటీవల పలు వన్డే సిరీస్ లకు దూరంగా వున్న మాజీ కెప్టెన్ డుప్లెసిస్ తాజా సిరీస్ కు అందుబాటులోకి రావడం ఆ జట్టుకు కలిసిరానుంది. 
 
 తుది జట్లు (అంచనా) : 
 
భారత్ : విరాట్ కోహ్లీ (కెప్టెన్),శిఖర్ ధావన్ ,పృథ్వీ షా ,కేఎల్ రాహుల్(కీపర్) ,జడేజా,శ్రేయస్ అయ్యర్ ,హార్దిక్ పాండ్య ,కుల్దీప్ /చాహల్, బుమ్రా ,సైని ,భువనేశ్వర్ కుమార్ 
 
సౌతాఫ్రికా జట్టు :  డికాక్ (కెప్టెన్ ,కీపర్), బావుమా ,వాన్ డెర్ దుస్సేన్ ,డేవిడ్ మిల్లర్ ,డుప్లెసిస్ ,ఫెహ్లుక్వాయో ,కైల్ వెర్రేయన్నే/క్లాసెన్ , బ్యురేన్ హెన్డ్రిక్స్, ఎంగిడి, నోర్జే, కేశవ్ మహారాజ్
 

మరింత సమాచారం తెలుసుకోండి: