ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లాండ్ చాంపియన్షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. భారత స్టార్ షెటిలర్ పీవీ సింధు శుభారంభం చేసింది. కొన్ని రోజులుగా ఫేమ్ కోల్పోయి అవస్థలు పడుతున్న భారత స్టార్‌ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ కు ఈ టోర్నీలో కూడా నిరాశే మిగిలింది. ఈ ఈవెంట్‌ లో తొలి రౌండ్ లోనే ఓటమి చెంది టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ అవకాశాల దారులను కష్టం చేసుకున్నాడు.

 

 

 

నిన్న అనగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆరో సీడ్‌ సింధు, బివాన్‌ జెంగ్‌ (అమెరికా)ను వరుస గేమ్‌లలో ఓడించింది. ఈ మ్యాచ్ 42 నిమిషాల పాటు జరిగింది. అలాగే పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్ లోనే శ్రీకాంత్‌ చైనాకు చెందిన మూడోసీడ్‌ చెన్‌ లోంగ్‌ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కాకపోతే టోక్యో బెర్త్‌ రేసులో ఉన్న శ్రీకాంత్‌ కు ప్రతి టోర్నీలోనూ రాణించడం మాత్రం కీలకం.

 

 

 


అలాగే ఇంకా మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలో సిక్కిరెడ్డి - ప్రణవ్‌చోప్రా జోడీ, టాప్‌ సీడ్‌ చైనా ద్వయం షీ వీజెంగ్‌, క్వింగ్‌ హువాంగ్‌ చేతిలో పోరాడి ఓడిపోయారు. మహిళల డబుల్స్‌ లో గాయం కారణంగా ప్రత్యర్థి జట్టు తప్పుకోవడంతో సిక్కిరెడ్డి, అశ్వినీ జోడి ప్రి క్వార్టర్స్‌ లోకి ఎంటర్ అయ్యింది. దింతో బుధవారం నాడు భారత ప్లేయర్స్ కి మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: