ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులకు పండగ అని చెప్పొచ్చు. మామూలుగానే ఇండియాలో క్రికెట్ కి ఎంతో క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ వచ్చిందంటే ఆ సందడి మరింత ఎక్కువైపోతుంది. ఇప్పటివరకు జట్టుగా ఆడిన ఆటగాళ్ళందరూ ప్రత్యర్థులుగా మారిపోయి హోరా హోరీగా పోటీ పడుతూ ఉంటారు. కాబట్టి ఆ మజా క్రికెట్ ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంది. అయితే ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్ లో  సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న  నేపథ్యంలో ఐపీఎల్ పై  రోజుకు ఒక అనుమానం తెరమీదికి వస్తూనే ఉంది. భారతదేశంలో  ఐపీఎల్ మ్యాచ్ లు  నిర్వహిస్తారా లేదా అని అనుమానం మొన్నటి  వరకు తెరమీదకి రాగా...  ఇప్పుడు తాజాగా  కూడా ఐపీఎల్ గురించి హల్చల్ చేస్తోంది. 

 

 ఐపీఎల్ 13వ సీజన్లో విదేశీ ఆటగాళ్లు ఆడే అవకాశాలపై ఎక్కువగా అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇతర దేశాల నుంచి వచ్చే వారికి ఏప్రిల్ 15 వరకు వీసాలు మంజూరు చేయకూడదని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కోసం విదేశీ ఆటగాళ్లు భారత దేశానికి వచ్చే అవకాశం లేదు అని తెలుస్తుంది. ఆటగాళ్లకు వీసాలు మంజూరు కావడం కష్టతరం అయిన నేపథ్యంలో... ఐపీఎల్ మ్యాచ్ లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా..? ఉండరా..? అనేది ప్రస్తుతం అనుమానంగానే మారిపోయింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో కరోనా  విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వీసా నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. 

 

 కేవలం దౌత్య, వర్క్ వీసా లకు మాత్రమే అనుమతి ఇవ్వాలి అంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చివరివారంలో ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమైనప్పటికీ... ఏప్రిల్ 15 వరకు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్ లు  ఆడే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఇక దీనిపై బిసిసిఐకి చెందిన గవర్నింగ్ కౌన్సిల్ కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న ముంబైలో సమావేశమై దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు బీసీసీఐ వర్గాల  నుంచి కీలక సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఐపీఎల్ కు బ్రేక్ పడనుంది అనే వార్తలు కూడా జోరందుకున్నాయి. కరోనా  వైరస్ ప్రభావం తగ్గేంతవరకు ఈ ఐపీఎల్ మ్యాచ్ లను వాయిదా వేయాలనే ఆలోచనల్లో  అటు కేంద్రం కూడా ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: