భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ లో టీ-20 సిరీస్ గెలిచినా కూడా వన్డేల్లో మరియు టెస్టుల్లో వైట్ వాష్ కు గురి అయ్యి మళ్ళీ సొంతగడ్డ పై అడుగుపెట్టింది. వారం తిరగక ముందే వారి ముందు ఇప్పుడు సఫారీ చాలెంజ్ నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలు అయ్యే ముందు ఇదే  భారత్ కు చివరి సిరీస్. అయితే నేడు ధర్మశాలలో మొదలు కావాల్సిన మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు అయ్యే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి గ్రౌండ్ స్టాఫ్ మూడు రోజుల నుండే వర్షసూచన ను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు పిచ్ పైన మరియు మొత్తం మైదానంలో ఉన్న పచ్చిక మీద అంతా కవర్లతో నింపేశారు.

 

IHG

 

మామూలుగా మొదటి వన్డే నిర్ణీత సమయం మధ్యాహ్నం 1:30కి మొదలు కావాల్సి ఉండగా వరుణుడు కుండపోతగా కురవడంతో అది కాస్తా మూడు గంటలకు జరుగుతుంది అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అంపైర్లు మరొక సమీక్ష జరిపి రెండు జట్ల మధ్య మ్యాచ్ ను 20 ఓవర్లకు కుదించారు. ఇక 20 ఓవర్ల కన్నా ఎక్కువ సేపు ఆట జరిగే అవకాశం లేకపోవడంతో రోజు సాయంత్రం 6:30 గంటలను కట్ ఆఫ్ టైం గా నిర్ణయించారు.

 

IHG

 

ఇక ఒకవైపు భారత్లో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తుంది. ఇంకొకవైపు వర్షం దెబ్బకు స్టేడియంలో దాదాపు అభిమానులంతా కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. జట్ల విషయానికి వస్తే సొంతగడ్డపై ప్రపంచంలో జట్టుకైనా భారత్ తో పోరు సవాలే. అదీ కాకుండా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శిఖర్ ధావన్ మరియు పేస్ బౌలర్ భువనేశ్వర్ రాకతో భారత జట్టు మరింత బలపడింది. ఇక సౌతాఫ్రికా విషయానికి వస్తే సీనియర్ ప్లేయర్ డూప్లెసిస్ మళ్లీ టీం లోకి తిరిగి రాగా వారి స్టార్ బౌలర్ రబాడా గాయం కారణంగా దూరమయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: