భారత్ క్రికెట్ చరిత్రలో ఎంతోమంది దిగ్గజ క్రికెటర్ లు  ఉన్నారు. ఎంతోమంది తమదైన రికార్డులను సృష్టించి చరిత్రపుటల్లోకెక్కారు . అయితే ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ కి సాధ్యంకాని సరికొత్త రికార్డును సృష్టించి... చరిత్ర పుటల్లో నిలిచిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. భారత జట్టును నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్ళిన గొప్ప కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. ఇక వికెట్ కీపింగ్ లో ఎనలేని ప్రతిభను కనబరిచి... వికెట్ కీపింగ్ పేరు ఎత్తగానే ధోని గుర్తొచ్చేలా ప్రభావితం చేసాడు ధోని . 2004 సంవత్సరంలో ధోని తొలి ఇంటర్నేషనల్ వన్డే ఆడాడు. ఒక సంవత్సరం తర్వాత శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు ధోని. మహేంద్రసింగ్ ధోని తక్కువ కాలంలోనే జట్టు సారథ్య బాధ్యతలను చేపట్టి.. టెస్టులు వన్డేల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా  రికార్డు సృష్టించారు. 2007లో రాహుల్ ద్రవిడ్  నుంచి వన్డే కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించారు ధోని . ఇక ఆ తర్వాత భారత్ కు  ఎన్నో విజయాలను అందించాడు. 

 


 మైదానంలో దూకుడు చూపించకుండా ఎప్పుడూ కూల్ గా ఉంటూ... తనదైన వ్యూహాలతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన గొప్ప కెప్టెన్ గా  చరిత్రలో కెక్కాడు మహేంద్రసింగ్ ధోని. ఇప్పటివరకు ఏ ఇండియన్ కెప్టెన్ కి సాధ్యం  కానీ రెండు ప్రపంచ కప్ లను భారత్ కు  అందించాడు. ఇక 2008 సంవత్సరంలో టెస్ట్ కెప్టెన్సీ ని కూడా చేజిక్కించుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. వికెట్ల వెనుక నిలబడి ఒకవైపు బౌలర్లకు ఎన్నో సలహాలు ఇస్తూనే.. రెప్పపాటుకాలంలో వికెట్ల వెనుక ఉండి స్టంప్ అవుట్ చేసి ఎంతో మంది దిగ్గజ క్రికెటర్ లను కూడా పెవిలియన్ కు  పంపించాడు ధోని . ధోనీ సారథ్యంలో టీమిండియా ఎన్నో విజయాలు  సాధించడమే కాదు నెంబర్ వన్ స్థానం లోకి దూసుకెళ్లింది. ధోనీ సారథ్యంలోని మొదటిసారి భారత్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో  మొదటి స్థానానికి వెళ్ళింది. 

 

 భారత క్రికెట్ చరిత్రలో ఎంతమంది కెప్టెన్లు ఉన్నప్పటికీ... ధోని కి మాత్రం ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది దిగ్గజ క్రికెటర్ లు కూడా చెప్పారు. ప్రస్తుతం టీమిండియా లో ఉన్న దిగ్గజ క్రికెటర్ లందరూ ధోని సారథ్యంలో ఎదిగిన వాళ్లే. ధోని సూచనలతో రాటుదేలిన వారే.ఇక ధోని మైదానం లో ఉన్నాడు అంటే ఎలాంటి మ్యాచ్ అయినా  విజయతీరాలకు నడిపించగలడు అని భారత క్రికెట్ ప్రేక్షకుల నమ్మకం. ఇక భారత క్రికెట్ చరిత్రలో గొప్ప సారధిగా  సరిగా ధోని పేరు తెచ్చుకున్నాడు. 2014లో డిసెంబర్ 30న టెస్టుల్లో రిటైర్మెంట్ ప్రకటించాడు మహేంద్రసింగ్ ధోని. కేవలం ఇంటర్నేషనల్ క్రికెట్లోనే కాకుండా భారత్లో జరిగే ఐపీఎల్ లో కూడా... చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు  బాధ్యతలను చేపట్టి మూడుసార్లు ఐపీఎల్ టోపీని అందించాడు. ఇప్పటికి ధోనీ సారథ్యంలో టీమిండియాకు అందించిన విజయాలతో ధోని క్రికెట్ చరిత్రలో విజయం సాధించాడు అనే చెప్పాలి. ఇలా మ్యాచ్ ఏదైనా.. ఫార్మాట్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా ధోని  కెప్టెన్సీకి తిరుగులేదు అని నిరూపించే క్రికెట్ చరిత్రలో విజయం సాధించి నేడు హెరాల్డ్ విజేతగా నిలిచాడు మహేంద్రసింగ్ ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి: