నేటి నుంచి సౌత్ ఆఫ్రికాతో మొదలు కానున్న మూడు వన్డేల సిరీస్ మొదటి మ్యాచ్ అనుకున్నట్టే ఒక్క బంతి ఆడకుండానే మ్యాచ్ రద్దు అయ్యింది. ఈరోజు మ్యాచ్ మధ్యాహ్నం 1 :30 గంటలకి ఆరంభం కావాల్సిన మ్యాచ్ మొత్తానికి వర్షార్పణం అయ్యింది. ఈరోజు ఉదయం నుంచే వాతావరణం అసలు మ్యాచ్ కి అనుకూలించలేదు. గత రెండు రోజుల నుంచి ధర్మశాల ప్రాంతాలలో ఏకధాటిగా వర్షం కురుస్తుంది.

 

 


దీనితో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అనుమానం ముందు నుంచే సాగింది. అనుకుంటే మ్యాచ్ టైంకి వరణుడు కరుణించలేదు. ఈ రోజు ఉదయం నుంచి వర్షం పలుమార్లు వచ్చి పోతావుంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ సిబ్బంది పిచ్ పై కవర్లను తీయడం, వేయడమే సరిపోయింది. మొత్తానికి అంపైర్లు పలుమార్లు గ్రౌండ్ లోకి వచ్చి వారి నిర్ణయాన్ని తెలుపుతూ వచ్చారు.

 

 


ఒక సందర్భంలో మ్యాచ్ ని కేవలం 20 ఓవర్ల మ్యాచ్ ని 06: 30 గంటలకి మొదలవుతుందని చెప్పారు. కానీ వారు ఆ విషయం వెల్లడించిన తరవాత అక్కడ వాతావరణ పరిస్థితి పూర్తిగా మారిపోయి కుండపోత వర్షం కురిసింది. దీనితో అంపైర్లు మ్యాచ్ ని పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: