మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఈరోజు  ధర్మశాల లో భారత్ , సౌతాఫ్రికాల మధ్య జరగాల్సిన మొదటి వన్డే  వర్షం వల్ల టాస్ కూడా పడకుండా రద్దయింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం తో మైదానంలో నీళ్లు నిలిచిచిపోయాయి దాంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. ఇక తదుపరి రెండు వన్డేలను ప్రేక్షకులు లేకుండా క్లోజ్డ్ స్టేడియంలో నిర్వహించుకోవాలని భారత ప్రభుత్వం బీసీసీఐ కి సూచించింది. దానికి కారణం ప్రస్తుతం ప్రపంచంతోపాటు దేశంలోనూ  కరోనా వైరస్ కేసులు నమోదు కావడమే.. .జన సమూహాం అధికంగా  వున్న చోట ఈ వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడం తో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో థియేటర్లను  తాత్కాలికంగా మూసివేశారు. 
 
ఇప్పుడు ఈకరోనా ప్రభావం క్రీడా రంగం పై  కూడా పడింది. దాంతో భారత్, సౌతాఫ్రికా లమధ్య జరుగనున్న చివరి రెండు వన్డేలు ఎంప్టీ స్టేడియంలో జరుగనున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న రెండో వన్డే లక్నో లో 18న మూడో వన్డే కోల్ కతా లో జరగాల్సి వుంది. మరి ఈమ్యాచ్ లకు బీసీసీఐ టికెట్లను అందుబాటు లో ఉంచుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: