టీమిండియా ఆల్ టైం బెస్ట్  ఓపెనింగ్ జోడి.. సచిన్, సెహ్వాగ్ ల బ్యాటింగ్ చూసే అవకాశం మళ్ళీ రోడ్ సేఫ్టీ సిరీస్ ద్వారా కలిగిందని సంతోషం లో వున్న ఫ్యాన్స్ కు ఆ ఆనందాన్ని ఎక్కువ రోజులు ఉంచలేదు కరోనా వైరస్. ప్రస్తుతం ఈ వైరస్  ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. భారత్ లో కూడా కరోనా కేసులు నమోదు అవుతుండంతో భారత ప్రభుత్వం ఈ వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వీసాల పై ఏప్రిల్ 15వరకు ఆంక్షలు విధించింది. ఎలాంటి సభలు నిర్వహించరాదని ఆదేశాలు జారీచేసింది. ఇక ఈ వైరస్ ప్రభావం క్రమంగా క్రమంగా అన్ని రంగాలపై పడుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో థియేటర్లను తాత్కాలికంగా మూసివేయగా పలు సినిమాల  విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ వైరస్ ప్రభావం క్రీడా రంగం పై కూడా పడింది. 
 
 
అందులో భాగంగా ఈవైరస్ సెగ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ కు కూడా తగిలింది. మహారాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భదత్ర పై అవగహన కలిపించేందుకు ప్రపంచంలోని మాజీ ఆటగాళ్ల తో ఈసిరీస్ ను నిర్వహిస్తుంది. ఇటీవలే ఈ సిరీస్ ప్రారంభం కాగా అందులో ఇప్పటికే  నాలుగుమ్యాచ్ లు జరుగాయి. అవన్నీ సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ఇండియా లెజెండ్స్ ఆడిన రెండు మ్యాచ్ లకు అభిమానులు పోటెత్తారు. ఇండియా లెజెండ్స్ కు సచిన్ , సెహ్వాగ్ , యువరాజ్ తోపాటు ఇతర మాజీ టీమిండియా ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు.  కాగా రెండిట్లో ఇండియా విజయం సాధించింది. ఇక మ్యాచ్ లు సూపర్ సక్సెస్ అవుతున్నాయనుకుంటున్న తరుణం లో కరోనా షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర లో ఇప్పటి వరకు 10 పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం తో అలర్ట్ అయిన ప్రభుత్వం వరల్డ్ సిరీస్ ను క్యాన్సల్ చేసింది. దాంతో ఈ సిరీస్ లో జరగాల్సిన మిగితా మ్యాచ్ లు రద్దయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: