చాపెల్-హ్యాడ్లీ వన్డే సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో స్వదేశం లో ఆస్ట్రేలియా మూడు వన్డే ల్లో తలపడనుంది. అందులో భాగంగా ఇరు జట్ల మధ్య మొదటి వన్డే, శుక్రవారం సిడ్నీ లో జరుగనుంది.  ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుండడం తో ఆప్రభావం ఈమ్యాచ్ పై  కూడా పడనుంది. మ్యాచ్ ను వీక్షించడానికి స్టేడియం లోకి  కొంత మందిని మాత్రమే అనుమతించనున్నారు. దాంతో చాలా స్టాండ్స్ వెలవెలబోనున్నాయి.
 
ఇదిలాఉంటే ఈ సిరీస్ లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల జెర్సీలు ప్రధానాకర్షణ గా నిలువనున్నాయి.  ఎందుకంటే గతంలో ఈ రెండు జట్లు ధరించిన  జెర్సీ లను గుర్తుకుతెచ్చేలా ప్రస్తుత సిరీస్ లో ఇరు జట్ల ఆటగాళ్లు  కొత్త జెర్సీలతో బరిలోకి దిగనున్నారు. ఇక ఇటీవల ఇండియా తో జరిగిన వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి న్యూజిలాండ్  నేటి మ్యాచ్ లో ఆత్మవిశ్వాసం తో బరిలోకి దిగుతుండగా ఈఏడాది వరుసగా వన్డే ల్లో 5ఓటములను చవిచూసిన ఆసీస్ ఎలాగైనా ఈమ్యాచ్ లో గెలిచి వరస పరాజయాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 9 గంటలకు ఈమ్యాచ్ ప్రారంభం కానుంది. 
 
తుది జట్లు (అంచనా): 
న్యూజిలాండ్ : గప్తిల్, విలియమ్సన్(కెప్టెన్),టేలర్ ,లేథమ్ (కీపర్) ,గ్రాండ్ హోమ్, నికోల్స్, సౌథీ, బౌల్ట్,జమైసన్/హెన్రీ ,ఫెర్గుసన్, సాన్ట్నర్
 
ఆస్ట్రేలియా :  ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్ , స్టీవ్ స్మిత్ ,లబుషెన్, డి ఆర్సీ షార్ట్ , అలెక్స్ క్యారీ /వేడ్ , మార్ష్ ,స్టార్క్ ,  కేన్ రిచర్డ్ సన్ ,పాట్ కమ్మిన్స్ , ఆడమ్ జంపా 

మరింత సమాచారం తెలుసుకోండి: