సిడ్నీవేదికగా ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి వన్డే లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత ఓవర్ల లో 7వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్(67),ఫించ్ ( 60) రాణించగా ..ఇటీవల సౌతాఫ్రికా పర్యటన లో విఫలమైన స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవెన్ స్మిత్ చెత్త ఫామ్ ను కొనసాగించాడు. సాన్ టర్న్ వేసిన అద్భుతమైన బంతికి బోల్డ్ అయ్యి 14పరుగులకే వెనుదిరిగాడు. ఆవెంటనే డి ఆర్సీ షార్ట్ కూడా అవుట్ కాగా 5వ స్థానంలో వచ్చిన లబుషెన్ (56) హాఫ్ సెంచరీ చేయడంతో ఆసీస్ గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్ల లో సోడి 3, సాన్ ట్నర్ 2, ఫెర్గుసన్ 2 వికెట్లు పడగొట్టారు. 
 
ఇక లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 41 ఓవర్ల లో 187 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ గప్తిల్ (40), లేథమ్ (38) పర్వాలేదనిపించినా స్టార్ బ్యాట్స్ మెన్లు కేన్ విలియమ్సన్ ,రాస్ టేలర్ లకు తోడు మిగితా ఆటగాళ్లు కూడా విఫలకావడం తో న్యూజిలాండ్ 71పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆసీస్ బౌలర్ల లో కమ్మిన్స్, మార్ష్ 3, హేజెల్ వుడ్ , జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈవిజయం తో ఆసీస్ మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తో అదిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈనెల 15న జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: