భారత్ - దక్షిణాఫ్రికా ఈ సిరీస్ మొదలవ్వక ముందు నుంచి ఏదో ఒక గోల. దీనికి కారణం మరేదో కాదండి... ప్రపంచ మహమ్మారి కరోనానే. సిరీస్ మొదలైంది అని సంతోసించేలోపే ఒక మ్యాచ్ వర్షార్పణం అయినా సంగతి మనందరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఏకంగా భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ పూర్తిగా రద్దైంది. 

 

 


ఈ మూడు వన్డేల సిరీస్‌ లో భాగంగా నిన్న ధర్మశాలలో జరిగిన తొలి వన్డే జరగాల్సి ఉండగా వర్షం కారణంగా కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు చేశారు. ఈ సిరీస్ లో ఇంకా 15 వ తేదీన లక్నోలో,  18 వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మిగితా రెండు వన్డేలు జరగాల్సి ఉంది. కాకపోతే కరోనా వైరస్ నిర్ధారిత కేసులు ప్రస్తుతం దేశంలో నానాటికి ఎక్కువ అవుతుండడంతో మొత్తం సిరీస్‌ నే రద్దు చేస్తున్నట్టు నేడు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 

 

 


కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో ఇప్పటికే చాలా ఈవెంట్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. అలాగే మన దేశం మెగా ఈవెంట్ అయిన ఈ నెలలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ ను కూడా బీసీసీఐ నేడు వాయిదా వేసింది. ఐపీఎల్‌ 2020 సీజన్ ఏప్రిల్ 15 తరవాత విడుదల చేస్తామని ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: