ప్రస్తుతం విరాట్ కోహ్లీ  ప్రపంచంలోనే  మేటి  బ్యాట్స్ మెన్ లలో  ఒకడు గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియాకు సారథ్యం వహిస్తూ  తనదైన వ్యూహాలతో ముందుకు నడిపిస్తూ ఎన్నో విజయాలను సాధించాడు. ఇక విరాట్ కోహ్లీ ఎప్పుడు మైదానంలో అగ్రెసివ్ గా ఉంటాడు అనే విషయం తెలిసిందే. విజయవంతమైన బ్యాట్స్ మెన్ గా ... జట్టులో కీలక ఆటగాడిగా... ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోతున్నాడు. గతంలో ధోని జట్టులో కొనసాగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టిన మొదట్లో  టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ నుంచి ఎన్నో సలహాలు సూచనలు తీసుకునేవాడు విరాట్ కోహ్లీ. 

 

 

 అయితే ఓ వైపు టీమ్ ఇండియా జట్టుకు సారథిగా వ్యవహరిస్తునే  మరోవైపు ఐపీఎల్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నాడు విరాట్ కోహ్లీ. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఎప్పుడూ విరాట్ కోహ్లీ సారథ్యంలో ఫైనల్స్ కు  వెళ్ళింది లేదు. కనీసం ఒక్కసారి కూడా కప్ గెలిచింది లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేటి ఆటగాళ్లు  అందరూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో ఉన్నప్పటికీ... ఆ జట్టు మాత్రం సక్సెస్ ఫుల్ గా రాణించలేక పోతోంది. 

 

 

 అయితే గతంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కెవిన్ పీటర్సన్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ గొప్ప ఆటగాడు అనే విషయాన్ని తాను  ముందుగానే గ్రహించాను అంటూ చెప్పుకొచ్చాడు కెవిన్ పీటర్సన్. 2009లో తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ కెరీర్  అప్పుడే మొదలైంది అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు కోహ్లీకి ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చాను అంటూ గుర్తు చేశారు కెవిన్ పీటర్సన్. కాగా  2011 నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా  కొనసాగుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: