కరోనా దెబ్బకు క్రీడా రంగం కుదేలైంది.. ముఖ్యంగా విపరిమితమైన ఆదరణ వుండే ఫుట్ బాల్,క్రికెట్ వంటి అంతర్జాతీయ క్రీడలపై  కరోనా  తీవ్ర ప్రభావం చూపింది. దీని వల్ల ప్రస్తుతం జరగాల్సిన ఫుట్ బాల్ టోర్నీ లు రద్దయ్యాయి. ఇక క్రికెట్ విషయానికి వస్తే  ఒకటి కాదు రెండు ఏకంగా మూడు అంతర్జాతీయ సిరీస్ లు కరోనా భయంతో అర్ధాంతరంగా రద్దయ్యాయి. అందులో   భారత్ - సౌతాఫ్రికా ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ ఒకటి.. మొదటి వన్డే వర్షం వల్ల రద్దు కాగా రెండు, మూడు వన్డేలను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలనుకుంది బీసీసీఐ కానీ అలా నిర్వహించి రిస్క్ చేయలేమని సిరీస్ ను మొత్తానికే  వాయిదా వేసింది. 
 
ఇక శ్రీలంక ,ఇంగ్లాండ్ లమధ్య జరగాల్సిన టెస్టు సిరీస్ కూడా కరోనా వల్ల ఆగిపోయింది. కొన్ని రోజులం క్రితం శ్రీలంక కు వచ్చి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినా ఇంగ్లాండ్ .. నిన్న సిరీస్ ను రద్దు చేసుకొని స్వదేశానికి వెళ్ళిపోయింది. ఇక ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ లమధ్య వన్డే సిరీస్ అయినా జరుగుతుందనుకుంటే తాజాగా దాన్ని కూడా రద్దు చేశారు. ఈ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ నిన్న సిడ్నీ  లోజరిగింది. ప్రేక్షకులు ఎవరు లేకుండా జరిగిన ఆ మ్యాచ్ ను టీవి లో చూస్తుంటే ప్రాక్టీస్ మ్యాచ్ చూసినట్లే అనిపించింది.  మొదటి మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించగా రేపు అలాగే ఈనెల 20న చివరి రెండు వన్డేలు జరగాల్సి వుంది కానీ ఇప్పడు వాటిని రద్దు చేశారు దాంతో  న్యూజిలాండ్ స్వదేశానికి పయనమైంది. ప్రస్తుతం  పురుషుల అలాగే మహిళల క్రికెట్ లో ఒక్క అంతర్జాతీయ సిరీస్ కూడా జరగడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: