టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్ , ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. అతన్ని కామెంట్రీ ప్యానెల్ నుండి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ లకు మాత్రమే కాదు ఐపీఎల్ నుండి కూడా మంజ్రేకర్ ను తప్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు  సమాచారం. అయితే మంజ్రేకర్ ఉద్వాసన కు గల కారణాలు మాత్రం తెలియలేదు. ఇక టీమిండియా తరపున 111 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన మంజ్రేకర్ 1996 నుండి క్రికెట్ వ్యాఖ్యాత కొనసాగుతున్నాడు. 
 
అంతేకాదు రవిశాస్త్రి , హర్ష భోగ్లే తోపాటు సంజయ్ మంజ్రేకర్ కూడా వ్యాఖ్యాత గా తనదైన ముద్ర వేశాడు అయితే ఇటీవల హర్ష భోగ్లే ,రవీంద్ర జడేజా ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు మంజ్రేకర్. బీసీసీఐ ఇప్పుడు కామెంట్రీ ప్యానెల్ నుండి అతన్ని తప్పించడానికి ఈ వివాదాలు కూడా కారణమయ్యాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా సంజయ్ తొలిగింపు పై  బీసీసీఐ నుండి ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ  ధర్మశాల లో ఇండియా -సౌతాఫ్రికా మొదటి వన్డే సందర్బంగా ఇతర వ్యాఖ్యాతలు.. సునీల్ గవాస్కర్ , మురళి కార్తిక్, శివ రామకృష్ణన్  హాజరయ్యారు కానీ  సంజయ్ మంజ్రేకర్ ఎక్కడా కనిపించలేదు దాంతో సిరీస్ కుముందే బీసీసీఐ ,మంజ్రేకర్ పై వేటు వేసి ఉంటుందని నేషనల్ మీడియా వెల్లడించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: