ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న  కరోనా వైరస్ కారణంగా ఐపీల్ టోర్నీ ని ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా ఏప్రిల్ 15 వరకు   బీసీసీఐ వాయిదా వేసింది . ఏప్రిల్ 15  వరకు కరోనా వైరస్ ప్రభావమన్నది లేకపోతేనే ఐపీల్ టోర్నీ జరిగే అవకాశాలున్నాయి . లేకపోతే ఈ సీజన్ ను రద్దు చేసేందుకే బీసీసీఐ మొగ్గు చూపడం ఖాయంగా కన్పిస్తోంది . అదే జరిగితే ఐపీల్ ప్రాంచైజీలతో పాటు బ్రాడ్ కాస్టర్లు తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయి . టోర్నీ రద్దయితే ఒకొక్క  ప్రాంచైజీ 150 - 200 కోట్ల రూపాయల మేరకు నష్టపోయే అవకాశమున్నట్లు తెలుస్తోంది .

 

ఒకవేళ ఏప్రిల్ 15 వ తేదీ నుంచి ఐపీల్ టోర్నీ ప్రారంభమైన   కరోనా వైరస్ కారణంగా మ్యాచ్ లు జరిగే స్టేడియాలు ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు అంతంత మాత్రమేనన్న వాదనలు విన్పిస్తున్నాయి . అదే జరిగితే టికెట్ల విక్రయం ద్వారా లభించే 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రాంచైజీ లు కోల్పోవాల్సి వస్తుందని తెలుస్తోంది . ఇక ఈ టోర్నీ ప్రసార హక్కుల్ని ఐదేళ్ల కాలానికి 16  వేల కోట్ల రూపాయలకు కుదుర్చుకున్న స్టార్ స్పోర్ట్స్ , ఈ సీజన్ ఐపీల్ టోర్నీ రద్దయితే 3200 కోట్ల మేరకు నష్టపోయే అవకాశాలున్నట్లు క్రీడానిపుణులు అంచనా వేస్తున్నారు .

 

ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీల్ ఏదో ఒక విధంగా  కొనసాగితే చాలు అన్నట్లుగా స్టార్ స్పోర్ట్స్ పరిస్థితి నెలకొంది . ప్రాంచైజీ లు , బ్రాడ్ కాస్టర్ కే కాకుండా బీసీసీఐ, ఆటగాళ్లు తమ ఆదాయాన్ని పెద్ద మొత్తం లో నష్టపోనున్నారు . భారత్ లో కరోనా వైరస్ ప్రభావాన్ని అరికట్టేందుకు   ఏప్రిల్ 15  వరకు  కేంద్ర ప్రభుత్వం వాణిజ్య విసాలపై నియంత్రణ విధించిన నేపధ్యం లో టోర్నీని  ఏప్రిల్ 15  వరకు వాయిదా వేసిన బీసీసీఐ , కేంద్రం ఒకవేళ ఈ గడవు పొడిగిస్తే ఏమి చేస్తుందన్నది హాట్ టాఫిక్ గా మారింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: