ప్రపంచంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉందో ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిబారిన పడిన వారి బాధ వర్ణనాతీతం. ఈ బాధ వారితో పాటు వారి కుటుంబ సభ్యులకి కూడా అంతే పరిమాణంలో ఉంటుంది. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ప్రపంచ ఫుట్ బాల్ లో దిగ్గజ దేశ జట్టుగా పేరొందిన అర్జెంటీనాకు చెందిన మిడ్ ఫీల్డర్ ఎజ్విక్వైల్ గారే (33)కు కరోనా సోకింది. అయన ప్రస్తుతం లా లీగా లీగ్లో వెలెన్సియా తరుపున ఆడుతున్న గారే కరోనా వైరస్ బారిన పడ్డాడు.

 

 


దానితో అతన్ని కాస్త ఐసోలేషన్ లో ఉంచి చికిత్స మొదలు పెట్టారు. అయితే అతడే ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ సంవత్సరం దుర్ముహూర్తంలో ప్రారంభమైంది. ఎక్కువగా జ్వరంతో బాధపడుతున్న నాకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా "పాజిటివ్" అని రిపోర్ట్ వచ్చింది. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్న అని గారే తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. 

 

 

 

అయితే స్పెయిన్ లో జరగాల్సిన ఉన్న "లా లీగా" సిరీస్ కు కూడా కరోనా సెగ తగలడంతో దాన్ని కూడా పూర్తిగా రద్దు చేసారు. ఎజ్విక్వైల్ గారే కి ఈ క్రమంలోనే గారేకు కరోనా వైరస్ సోకింది. ఏదిఏమైనా స్పెయిన్ లో మాత్రం ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. అక్కడ వందల సంఖ్యలలో ప్రాణాలు కోల్పోయారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: