మాములుగా ఎక్కడైనా సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు ఆట‌గాళ్లు ఒక‌రినొక‌రు చేతుల‌తో తాకుతూ, షేక్ హ్యాండ్ చేస్తూ అభినందించుకోవడం పరిపాటి. కాకపోతే ఇలా చాలా మ్యాచ్‌ ల్లో మనం దీన్ని చూశాం. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్‌ లో ఒక కొత్త వరవడి మొదలైంది. అక్కడ జ‌రుగుతున్న ఢాకా ప్రీమియ‌ర్ డివిజ‌న్ లీగ్ క్ల‌బ్ ఆట‌గాళ్లు మాత్రం ఒక విచిత్ర‌మైన సెలబ్రేష‌న్స్‌ తో అందరిలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. వారందరూ షేక్ హ్యాండ్‌ కు బదులుగా ఒక‌రి మోచేతిని, మ‌రొక‌రు ట‌చ్ చేస్తూ వారి అభినంద‌న‌లు తెలుపుకున్నారు. 

 


ఇలా వారందరూ క్రికెట‌ర్లు ఇలా కొత్త త‌ర‌హా సెల‌బ్రేష‌న్స్ చేసుకోడానికి కార‌ణం మరేదో కాదు... క‌రోనా వైర‌స్ మాత్రమే. ప్రస్తుతం ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ తన ప్ర‌భావాన్ని అడ్డుకోవడానికి కొన్ని జాగ్ర‌త్తలు తీసుకోవ‌డం త‌ప్ప‌నిసరి కనుక ఈ క్ర‌మంలోనే వారందరూ ఒక‌రినొక‌రు చేతుల‌తో తాక‌కుండా జాగ్ర‌త్త వ‌హిస్తే, కరోనా వైరస్ నుంచి త‌ప్పించుకోవచ్చు. ఇప్పుడు  బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు అందరూ ఇదే సూత్రాన్ని పాటించారు. 

 

 


ప్రస్తుతం ఈ లీగ్‌ లో ప్రైమ్‌ బ్యాంక్‌ సీసీ- గాజీ గ్రూప్ జ‌ట్ల మ‌ధ్య ఒక మ్యాచ్ జ‌రిగింది. కాకపోతే ఈ మ్యాచ్‌ లో రోనీ తాలుక్‌ దార్‌ ను ఔట్ చేసిన మ‌హ్ముదుల్లాను అంద‌రు మోచేతితో చీర్స్ చెబుతూ వారందరూ అభినందించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: