ఆస్ట్రేలియా క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆస్ట్రేలియా జ‌ట్టులో తిరుగులేని సిక్స‌ర్ల వీరుడిగా రికార్డుల‌కు ఎక్కిన మ్యాక్స్‌వెల్ ఇటు ఐపీఎల్ ద్వారా కూడా ఇక్క‌డ ఎంతో మంది అభిమానుల మ‌న‌స్సుల‌ను దోచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఓ భార‌త అమ్మాయి మ‌న‌స్సును దోచుకుని ఇప్పుడు ఆ అమ్మాయిని మ‌నువాడ‌నున్నాడు. భారత సంతతికి చెందిన ఫార్మసిస్ట్‌ విని రామన్‌తో అతడి నిశ్చితార్థం  భారతీయ సాంప్రదాయ శైలిలో ఘనంగా జరిగింది.



మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగిన ఈ వేడుక‌లో మ్యాక్స్‌వెల్ బంధువులు సైతం భార‌తీయ సంప్ర‌దాయం త‌ర‌హాలో చీరకట్టు, కుర్తా, పైజామాలు ధరించి ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరు కావడం పెద్ విశేష‌మ‌నే చెప్పాలి. అలాగే మ్యాక్స్‌వెల్ సైతం భార‌తీయ సంప్ర‌దాయం త‌ర‌హాలో ముస్తాబయ్యాడు. ఇక ఓ భార‌తీయ యువ‌తిని పెళ్లాడిన రెండో క్రికెట‌ర్‌గా మ్యాక్స్‌వెల్ రికార్డుల‌కు ఎక్కాడు. అంత‌కు ముందు ఆసీస్ ఫేస్ బౌల‌ర్ షాన్ టైట్ భారత్‌కు చెందిన యువతినే పెళ్లాడాడు.



ఐపీఎల్‌ 2014 సమయంలో ఓ వేడుకలో పరిచయమైన మషూమ్‌ సింఘా షాన్‌ టైట్‌ ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఇప్పుడు మ్యాక్స్‌వెల్ సైతం భార‌తీయ అమ్మాయినే పెళ్లి చేసుకుని ఇండియ‌న్ అల్లుడు అయిన రెండో ఆసీస్ క్రికెట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కారు. ఇక గ‌తంలో కూడా వెస్టిండిస్ టాప్ క్రికెట‌ర్ వివియ‌న్ రిచ‌ర్డ్స్ బాలీవుడ్ హీరోయిన్ నీనా గుప్తాను పెళ్లాడాడు. అలాగే శ్రీలంక ఆఫ్ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ సైతం చెన్నై అమ్మాయిని పెళ్లాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: