కరోనా.. కరోనా.. ఎటుచూసినా కరోనా కు సంబంధించిన విషయాలే. ఇప్పుడు దేశంలో దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది. అందులో క్రీడా రంగం పైనా కూడా పడింది. ఇదివరకే దేశంలో క్రీడా రంగంలో పెద్ద పండుగగా చెప్పుకొనే ఐపీఎల్ సహా పలు దేశీయ, అంతర్జాతీయ టోర్నీలు అన్ని వాయిదాపడ్డాయి. దీనితో ఆటగాళ్లంతా ఇళ్ల వరకే పరిమితమయ్యారు. దీనితో ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఫిట్‌నెస్ పోతుందేమోనని అని వారు ఇప్పుడు భయపడుతున్నారు. దీనితో జిమ్‌ కి వెళ్దామంటే బయట పరిస్థితి ఎలా ఉందొ తెలుసు. బయట కరోనా దెబ్బకు అన్ని జిమ్స్ ఎక్కడ కూడా తెరుచుకోలేదు. 

 

 

ఇలాంటి పరిస్థితుల్లో భారత క్రికెట్ ప్లేయర్ సురేష్ రైనా సరికొత్త జిమ్‌ ని ఆయన సృష్టించాడు. రైనా పచ్చని ప్రకృతిలో చెట్ల మధ్య వర్క్ ఔట్స్ మొదలు పెట్టాడు. చెట్టుకు బెల్ట్ కట్టి జిమ్ చేస్తున్న వీడియోను ట్విటర్‌ లో రైనా పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ లో అన్ని జిమ్స్ ముసేసినంత మాత్రాన వర్క్ ఔట్స్ చేయకుండా ఉంటామా...? అని కామెంట్ చేశాడు ఈ స్టార్ ఐపీల్ ప్లేయర్. ఇకపోతే ఫామ్ కోల్పోయిన టీమిండియాకు దూరమైన సురేశ్ రైనా ఐపీఎల్‌ లో మాత్రం తన దూకుడిని కొనసాగిస్తున్నాడు. 

 

 

 

MS ధోనీ కెప్టెన్‌ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతడు ఒక సభ్యుడు. ఏది ఏమైనా రైనా ఐడియా సూపర్ కదా...!

మరింత సమాచారం తెలుసుకోండి: