ఇండియాలో ఐపీఎల్ జరుగుతుంది అంటే క్రికెట్ సందడి మామూలుగా ఉండదు అన్న విషయం తెలిసిందే. అయితే మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభం కావాల్సి ఉండగా భారతదేశంలో కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో... విదేశీ ఆటగాళ్లకు ఏప్రిల్ 15 వరకు విదేశీ ఆటగాళ్లను భారత్ కి కేంద్ర ప్రభుత్వం అనుమంతించదు   కాబట్టి బిసిసిఐ సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 తర్వాత ఐపీఎల్ నిర్వహించాలని బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏప్రిల్ 15 తర్వాత ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే దానిపై కూడా ప్రస్తుతం అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ  ఐపీఎల్ నిర్వహించేందుకు ప్లాన్ బి అమలు చేస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2020 జులై సెప్టెంబరు మధ్య సమయంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై బిసిసిఐ ఆలోచన చేస్తుందట. 

 

 

 అయితే బిసిసిఐ ప్లాన్ బి  అమలు చేయాలంటే కేవలం భారతదేశంలో కరోనా  వైరస్ ప్రభావం తగ్గడమే కాదు ఐసీసీ భవిష్యత్తు షెడ్యూల్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ లో ఆసియా కప్ ఉంటుంది. అదే సమయంలో ఇంగ్లాండ్ పాకిస్తాన్ లో సిరీస్ కూడా ఉంది. ఇక ఇంగ్లాండ్ పాకిస్తాన్ జట్లు మినహా  ఆస్ట్రేలియా,వెస్టిండీస్, న్యూజిలాండ్,దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ జట్లకు  మాత్రమే ముందుగా నిర్ణయించిన ప్రకారం ఎలాంటి షెడ్యూల్స్ లేవు. సెప్టెంబర్ లో జరగబోయే ఆసియా కప్ మినహాయిస్తే టి20 వరల్డ్ కప్ వరకు ఎలాంటి సిరీస్ లు లేవు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లీగ్ దశ మ్యాచ్ లను  కూడా విదేశాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది బిసిసిఐ.

 

 

 మొత్తం లీగ్  మ్యాచ్ లను  విదేశాల్లో నిర్వహించే ఆలోచన చేస్తుందట బిసిసీఐ. ఇక లీగ్ మ్యాచ్ లు  నిర్వహించాలని కూడా దగ్గర కూడా కరోనా వైరస్ ప్రభావం ఉండకుండా చూసుకోవాలి. బీసీసీఐ  లీగ్ మ్యాచ్ లు  నిర్వహించేందుకు ఏ దేశాన్ని ఎంచుకున్న కరోనా  వైరస్ ప్రభావం మాత్రం కీలకంగా మారనుంది. ఇక భారత దేశంలో కూడా పూర్తిగా కరోనా వైరస్  నియంత్రణలోకి వస్తేనే ప్లాన్ బి  అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ బిసిసిఐ ఐపీఎల్ నిర్వహించాలి అనుకున్న సమయంలో కూడా కరోనా  ప్రభావం తగ్గకపోతే ప్లాన్ బీ కూడా అమలు కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరం అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించాలనే పట్టుదలతో బిసిసిఐ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: