ప్రస్తుతం ప్రపంచాన్ని ప్రాణభయంతో వణికిస్తున్న మహమ్మారి  భారత ఈ దేశంలో కూడా అడుగు పెట్టి ఎంతో మంది ప్రజలకు ప్రాణ హాని కలిగిస్తుంది. రోజురోజుకు భారతదేశంలో కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ నీ ఈ మహమ్మారి వైరస్ విజృంభన మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోడీ... దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందిన కరోనా వైరస్ ను ఎదిరించేందుకు ప్రజలందరూ దృఢ సంకల్పంతో ఉండాలి అంటూ పిలుపునిచ్చారు. ఇక 22వ తేదీన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని దేశ ప్రజలందరికీ పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ. జనతా కర్ఫ్యూ  పాటించడం ద్వారా కరోనా వైరస్ ను  అరికట్టేందుకు వీలు ఉంటుంది తెలిపారు. 

 


 అయితే ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ కి  దేశ వ్యాప్తంగా ఎంతో మద్దతు వస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు అందరు మద్దతు తెలుపుతూ జనతా కర్ఫ్యూ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఇక ఇప్పటికే దీనిపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ మద్దతు తెలపాలని కోరారు. మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సైతం దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కరోనా వైరస్ పై  ప్రధాని మోడీ చేసిన సూచనలు చాలా ముఖ్యమైనవని... కరోనా వైరస్ ను నియంత్రించడానికి జనతా కర్ఫ్యూ లాంటి  యుద్ధాన్ని ప్రకటించిన క్రమంలో మోదీ సూచనను దేశ ప్రజలు అందరూ పాటించాలి అంటూ ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ మహమ్మద్ కోరాడు. 

 


 ఇక దీనికి రిప్లై ఇచ్చిన మోడీ మరో ఆసక్తికర పోస్టు పెట్టారు. మరో భాగస్వామ్యానికి సమయం వచ్చింది అంటూ ప్రధాని మోడీ తెలిపారు. కరోనా వైరస్ పై  పోరాటానికి భారత ప్రజల అందరి భాగస్వామ్యం కావాలి అంటూ మహమ్మద్ కైఫ్ చేసిన పోస్ట్ కి ప్రధాని నరేంద్ర మోడీ రిప్లై ఇచ్చారు. 2002లో నాట్ వెస్ట్  ఫైనల్లో భారత్ 326 పరుగులు సాధించి విజయాన్ని సాధించిన రోజును  ఈ సందర్భంగా గుర్తు చేశారు నరేంద్ర మోడీ. ఆరోజు మహమ్మద్ కైఫ్ యువరాజ్ సింగ్ ఆడిన ఫైనల్ మ్యాచ్ లో ఎవరు మర్చిపోలేరు. యువరాజ్ మహమ్మద్ కైఫ్ భాగస్వామ్యం అసాధారణమైనది క్రికెట్ ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుంటుంది. అంటూ మోదీ చేసిన పోస్ట్  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది . అయితే ఆ రోజు కేవలం 146 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోయిన క్లిష్ట సమయంలో యువరాజ్ మహమ్మద్ కైఫ్ లు  అద్భుతంగా మెరుపులు మెరిపించి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి  మ్యాచ్ ను గెలిపించారు. అంతేకాదు ఆ రోజే క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ తన చొక్కా విప్పేసి మరి సంబరాలు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: