కరోనా ప్రస్తుత్తం ప్రపంచాన్ని అల్లా కల్లోలం చేస్తున్న వైరస్. ఈ వైరస్ తో బాధపడుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పది వేల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధి చాల త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి పేరు చెప్తేనే ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టుకొస్తుంది.

 

కరోనా కారణంగా ఇప్పటికే థియేటర్స్, విదేశీ రాకపోకలను నిలివేశారు. విదేశాల నుండి వచ్చిన వారికీ వైద్యులు పరీక్షలు చేసి, 14 డేస్ వైద్యుల ఆధీనంలోనే ఉంచుతున్నారు. 14 డేస్ అనంతరం వారిని ఇంటికి పంపిస్తున్నారు. వారు ఎవ్వరిని ముట్టుకోకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు చెప్పుతున్నారు.

 

తాజాగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. అతను పాకిస్థాన్ సూపర్ లీగ్‌ లో ఆడేందుకు అక్కడికి వెళ్లారు. మరల అయన తిరిగి వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టాడు.

 

దీంతో అక్కడి ప్రభుత్వ ఆదేశాలకి అనుగుణంగా 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు సామీ వెల్లడించాడు. విదేశాల నుంచి వచ్చిన వారు కనీసం రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని అన్ని దేశాల ప్రభుత్వాలు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

 

కరోనా కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. డారెన్ సామీని వెస్టిండీస్‌ కి పంపించే ముందు అతని నుంచి శాంపిల్స్ పాక్ అధికారులు సేకరించారు. ఆ నమూనాలకు టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగటివ్ వచ్చింది.

 

కానీ తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు డారెన్ సామీ వెల్లడించాడు. అయితే  డారెన్ సామీ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆశించిన మేర సత్తాచాట లేకపోయాడు. టోర్నీలో నాలుగు మ్యాచ్‌ లాడిన సామీ 44 పరుగులు చేశారు. అతను ఒకే ఒక వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: