గ‌త రెండేళ్లుగా గాయాల‌తో ఇబ్బంది ప‌డిన భువ‌నేశ్వ‌ర్ ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం చూస్తున్నాడు. కాకపోతే భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా వ‌న్డే సిరీస్‌ రద్దు కావడంతో అదింత కాస్త వాయిదా పడింది. అయితే 2012 సంవత్సరంలో అరంగేట్రం చేసిన భువీ ఇప్పటి వరకు భారత్ బౌలింగ్ కి సంబంధించి ఆయన ఒక ప్రతేకత కలిగాడు. ముఖ్యంగా ఆయన బౌలింగ్ లో స్వింగ్ బౌలింగే అతని ఆయుధం. 

 

 

అయితే రోజులు గడిచే కొద్ది త‌న‌కు ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని, ఈక్ర‌మంలోనే త‌న బౌలింగ్‌లో పేస్ పెంచుకోవాల‌ని నిర్ణయించుకోనున్నాని ఆయన పేరుకొన్నారు. ఒకవేళ స్వింగ్ ప‌రిస్థితులు లేన‌ప్పుడు త‌మ బ్యాటింగ్‌ను అడ్జ‌స్ట్ చేసుకుని వేసే బౌలింగ్ ని అలవోకగా వాటిని ఎదురుకుంటారని ఆయన తెలిపాడు. దీనితో బౌలింగ్‌లో వాడి పెంచుకోవ‌డం అంత సుల‌భం కాదు అని తెలిపాడు. 

 

 

కాకపోతే ప్రస్తుతం ఆయన తన బౌలింగ్ లో కాస్త వేగం పెంచాడు. దీనితో మొదట్లో ఒకటి రెండు సిరీస్‌ల్లో ఇబ్బందులు పడ్డాడని తెలిపాడు. దింతో త‌న శ‌రీరంపై అద‌న‌పు భారం ప‌డిన‌ట్లు అయిందని ఆయన తెలిపాడు. కాకపోతే రోజులు గడిచే కొద్దీ అన్నీ స‌ర్దుకున్నాయని, ప్రస్తుతం నా బౌలింగ్ మంచి రిధంలో ఉందని తెలిపాడు. ప్రస్తుతం బుమ్రా తో పాటుగా భువీని కూడా ప్ర‌స్తుతం డెత్ ఓవ‌ర్ల స్పెష‌లిస్టుగాను ప‌రిగ‌ణిస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: