కరోనా వైరస్... కరోనా వైరస్... ప్రస్తుతం ప్రాంచంలో ఎక్కడ చూసిన ఒకే విషయం మీద ఉంది అంటే అది కరోనా వైరస్ గురించే. అలంటి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భారతదేశ ప్రజలు చూపుతున్న పక్రియని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అభినందించాడు. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు సుమారు దేశంలోని 130 కోట్ల మంది ఒక తాటిపైకి వచ్చి జనతా కర్ఫ్యూలో ఆదివారం భాగస్వామ్యం కావడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించాడు. 

 

 


కాకపోతే కరోనా వైరస్ కట్టడిలో పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్ర అలక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించాడు. నిజానికి ఇప్పటికీ పాక్ లోని ప్రజల్లో కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన లేదని చెప్పాడు ఈ మాజీ బౌలర్ అక్తర్. ఈ పరిస్థితులలో దొరికిన సెలవుల్లో అందరూ విహారయాత్రలకి వెళ్తుండటం ఆలోచించవలిసిన విషయం అని ఆయన వెల్లడించాడు. ఇది ఇలా ఉండగా పాక్‌ లో ఇప్పటికే ఏకంగా 700 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

 

 


కరోనా వైరస్ కట్టడికి భారతదేశంలో కర్ఫ్యూని విధించారు. మరి పాకిస్థాన్‌లో ఎందుకు అలాంటి రక్షణాత్మక చర్యలు తీసుకోవడం లేదు..? అని ఆయన ప్రశ్నించాడు. కరోనా వైరస్ ఎక్కువగా మనుషుల కలవడం ద్వారానే వస్తుందని, కానీ.. పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం అలసత్వం కారణంగా ప్రజలు ఎవరూ ఇళ్లలో ఉండటం లేదని ఆయన వివరణ ఇచ్చాడు. ఇది నిజానికి దేశానికి ప్రమాదకరంగా మారబోతోందని అక్తర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా భారత్ ని దృష్టిలో పెట్టుకొని పాకిస్థాన్ ని ఆ దేశ పౌరుడు వాళ్ళ దేశానికీ తెలపడం నిజంగా మన దేశ గొప్పతనమే అని చెప్పవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: