క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) 2020-21కి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రక్టుల జాబితాను ప్రకటించింది. ఇందులో కొత్తగా బ్యూరాన్ హెన్డ్రిక్స్, వాన్ డెర్ డుస్సెన్ , ప్రిటోరియస్, నొర్జే చోటు దక్కించుకోగా ఇటీవల టీ 20 ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ కాంట్రక్టు ను పునరుద్దరించలేదు. ప్రపంచ కప్ తరువాత స్టెయిన్ టెస్టు,వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల సొంత గడ్డపై ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ లో రాణించిన యువ వికెట్ కీపర్ క్లాసెన్ కు కూడా సీఎస్ఏ షాక్ ఇచ్చింది. అతనికి కూడా కాంట్రక్టు ఇవ్వలేదు. 
 
ఇదిలావుంటే రెండు వారాల క్రితం ఇండియా పర్యటనకు వచ్చిన సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వెనుదిరిగింది. ఈపర్యటన లో టీమిండియా తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో తలపడాల్సి ఉండగా మొదటి వన్డే వర్షం వల్ల రద్దు కాగా ఆతరువాత మిగితా రెండు వన్డేల ను కరోనా భయం తో రద్దు చేశారు. ఈఏడాది చివర్లో ఈ సిరీస్ ను మళ్ళీ నిర్వహించనున్నారు. 
 
సెంట్రల్ కాంట్రాక్టు ను దక్కించుకున్న ఆటగాళ్లు : 
 
డికాక్, బావుమా , వాన్ డెర్ డుస్సెన్ ,డేవిడ్ మిల్లర్ ,డు ప్లెసిస్ ,ఎల్గర్,రీజా హెడ్రిక్స్,మక్రామ్ ,ఫెహ్లుక్వయో ,బ్యురేన్ హెన్డ్రిక్స్, ఎంగిడి, నోర్జే, కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, శంసి,రబాడ

మరింత సమాచారం తెలుసుకోండి: