దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండడం తో ఈఏడాది ఐపీఎల్ జరగడం దాదాపు అసాధ్యమే అని తేలిపోయింది. ఈరోజు బీసీసీఐ ,ఐపీఎల్ ప్రాంఛైజీల మధ్య జరుగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ కూడా వాయిదాపడింది. ఇక  ఇప్పటివరకు 12 సీజన్ లను సక్సెస్ ఫుల్ గా నిర్వహించుకుంటూ వచ్చిన బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలికి తాజాగా కరోనా భారీ షాక్ ఇచ్చింది. మార్చి 29నుండి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది  కానీ కరోనా దేశంలోకి ఎంటర్ కావడం తో ఇప్పుడు సీజన్ మొత్తాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఏకంగా 19 రాష్ట్రాలు మార్చి 31 వరకు లాక్ డౌన్ ను విధించాయి. అత్యవసర పరిస్థితిల్లో తప్ప జనాలను బయటికి రానివ్వడం లేదు. దేశంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే విదేశీయులను ఇప్పట్లో రానివ్వడం జరిగేపనేనా.. ఐపీఎల్ లో మనవాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొంటారని తెలిసిందే. దాంతో బీసీసీఐ.. ఐపీఎల్ 13 నిర్వహణ పై చేతులేత్తిసినట్లే కనిపిస్తుంది.
 
ఇక ఇప్పటివరకు ప్రతి సీజన్ కు ఆదాయంను పెంచుకుంటూ పోతున్న బీసీసీఐ అలాగే ఐపీఎల్ ప్రాంఛైజీలకు ఈ సారి ఐపీఎల్ రద్దయితే ఊహించని రీతిలో నష్టాలు రానున్నాయి. ఈఏడాది ఐపీఎల్ లేకుంటే బీసీసీఐ సుమారు 2000కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది అలాగే ప్రతి ఐపీఎల్ టీంకు 100కోట్ల మేర నష్టం కలుగనుంది. మొత్తానికి కరోనా ఊహించని రీతిలో దెబ్బ కొట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: