కరోనా ప్రభావం 2020 టోక్యో ఒలింపిక్స్ పై కూడా పడింది. జులై 24నుండి టోక్యో ఈ ఒలింపిక్స్ ను ప్రతిష్ఠాత్మకంగా  నిర్వహించాలనుకుంది అందుకోసం ఇప్పటికే  భారీ గా ఖర్చు చేసింది కానీ ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని వణికిస్తుండడం తో ఒలింపిక్స్ వాయిదాపడనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) సభ్యుడు డిక్ పౌండ్ వెల్లడించాడు. మరో నాలుగు వారాల్లో దీని పై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నామని ఆయన పేర్కొన్నాడు. ఇక ఒకవేళ షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్ ను నిర్వహిస్తే మేము తప్పుకుంటామని ఇటీవల కెనడా ప్రకటించగా ఆస్ట్రేలియా కూడా తమ క్రీడాకారులను పంపించమని స్పష్టం చేసింది.  
 
ఇక ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 16000 మందికి  పైగా కరోనా వల్ల మరణించారు చాలా దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశాయి కరోనా  అటు ఆర్థికంగా కూడా దారుణంగా దెబ్బ తీస్తుంది  ఈ పరిస్థుల నుండి కోలుకోవడానికి ఆయా దేశాలకు చాలా సమయం పట్టేలానే వుంది ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహించడం కన్నా వాయిదా వేయవడమే ఉత్తమం అని ఐఓసీ తీర్మానించింది. ఈ ఒలింపిక్స్ ను ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. జపాన్ అధ్యక్షుడు షింజో అబే కూడా పార్లమెంట్ లో మాట్లాడుతూ.. ఒలింపిక్స్ ను వాయిదా వేయడం తప్పకపోవచ్చని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: