శిఖర్ ధావన్... ఈ పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా... దీనికి కారణం ఆయన టీమిండియాకు ఎంత కరెక్ట్ ఓపెనింగ్ బాట్స్మెన్ అని అందరికి తెలిసిన విషయమే. రోహిత్ శర్మ తో కలిసి గ్రౌండ్ లోకి అడుగు పెడితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అన్ని బాగున్నా ఎంతటివాడైన సరే భార్య చెప్పిన మాట వినాల్సిందే అని మరోసారి రుజువు చేసాడు ఈ స్టార్ క్రికెటర్. ఇక అసలు విషానికి వస్తే...

 

 

బ్యాట్ పట్టాల్సిన చేతులతో బట్టలు ఉతికాడు మన స్టార్ క్రికెటర్. కొన్ని రోజుల క్రితమే ప్రపంచంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దాదాపు అన్ని క్రీడలను ఆపేసారు. దీనితో చాలామంది ఆటగాళ్లందరూ తమ కుటుంబాలకు పూర్తి సమయాన్ని వారు వెచ్చించారు. వారందరు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు సామాజిక దూరం పాటిస్తూ వారందరు ఇళ్లలోంచి బయటకు రావట్లేదు. ఇప్పుడు వాళ్ళందరూ వారివారి కుటంబాలతో గడుపుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా వారు వారితో గడిపిన క్షణాలను వారివారి సోషల్ మీడియా అకౌంట్ లలో పోస్ట్ చేస్తున్నారు. 

 


ఈ క్రమంలోనే మన స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసాడు. అయితే ఈ వీడియోలో శిఖర్ ధావన్ బట్టలు ఉతకడంతో పాటు, వారి బాత్రూమ్ ను కూడా శుభ్రం చేస్తున్న సన్నివేశాలని మనం అందులో చూడొచ్చు. అయితే ఈ వీడియోను సరదాగా షేర్ చేయగా, ఆ వీడియోలో అతని భార్య మిర్రర్ ఎదుట అలంకరించుకోవడం ఈ వీడియోలో చాలా స్పష్టంగా కన్పిస్తుంది. ఇదంతా ఆలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్‌ లో అతడి పార్టనర్ కం ఓపెనర్ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ వీడియోను తన అకౌంట్ ద్వారా షేర్ చేయడం ఒక విశేషమే.

మరింత సమాచారం తెలుసుకోండి: