కరోనా దెబ్బకి అన్ని క్రీడా సంగ్రామాలు ఆపేసిన విషయమా అందరికి తెలిసిందే. దీనితో అన్ని క్రీడా రంగాల ఆటగాలందరూ వారివారి కుటుంబ సభ్యులతో వారి సమయాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే వారికీ తీరిక దొరికినప్పుడల్లా వారి సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్లైన్ లో ప్రత్యక్షమైతున్నారు.అందరికి తెలిసినట్టుగానే ఆన్లైన్ మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండే వారిలో శ్రేయాస్ అయ్యర్ కూడా ఒకరు. ఆన్లైన్ లో ప్రత్యక్షమైన ఆయనను క్రికెట్ అభిమానులు కొన్ని ప్రశ్నలు అడగా అతను తన శైలిలో సూటిగా సమాధానాలు ఇచ్చాడు.

 

 


ఇక పూర్తి విషయాలకి వస్తే... ధోనీ, రోహిత్ శర్మల గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకి శ్రేయాస్ అయ్యర్ సూటిగా సమాధానాలు ఇచ్చాడు. ధోనీ గురించి శ్రేయాస్ ఏమి చెప్పాడంటే నిజానికి ఆయన గురించి ఒక్క మాటలో చెప్పమంటే... ‘‘అతను కూల్, కామ్, నిజమైన లీడర్’’ అని ధోని గురించి చెప్పాడు. అలాగే రోహిత్ శర్మతో బాండేజ్‌ గురించి అయ్యర్ చెబుతూ ‘‘రోహిత్ శర్మ చాలా మంచి వ్యక్తి. అందర్నీ వెన్నుతట్టి ఆయన ప్రోత్సహిస్తుంటాడు. అలానే టీమ్‌ లోని సహచరుల్ని కూడా చాలా బాగా చూసుకుంటాడు’’ అని రోహిత్ గురించి చెప్పుకొచ్చాడు. ఇక తనకు సంబంధించి ఆల్‌ టైమ్ బెస్ట్ బౌలర్‌ గా జహీర్ ఖాన్‌ అన్ని చెప్పుకొచ్చాడు. అలాగే టీమిండియాలో  ఫన్నీ క్రికెటర్ ఎవరని అడగగా చాహల్‌ అని టక్కున చెప్పకనే చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: