అవును మీరు చదివింది నిజమే. ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో జరిగే మగవారి ఐసీసీ టీ - 20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. కోరిన పుణ్యమా అని అన్ని క్రీడా పోటీలు అన్ని రద్దు అయిన సంగతి తెలిసిన విషయమే. అయితే ఈ టోర్నీ జరగడానికి ఇంకా ఆరు నెల గడువు ఉన్న ప్రస్తుతం ప్రపంచంలోని కరోనా దృష్ట్యా దీన్ని కొనసాగించడం వీలు పాడనీ స్థితి. దీనితో టీ - 20 వరల్డ్‌కప్ ని ఐసీసీ కచ్చితంగా వాయిదా వేసి 2021 లో జరిపేలా కసరత్తులు మొదలు పెట్టింది.

 

 

అసలు ఇక్కడ ఒక విషయం ఏమిటంటే వచ్చే ఏడాది అనగా 2021 టీ - 20 వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులు ప్రస్తుతం భారత్ వద్ద ఉన్నాయి. దీనితో వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో ఆతిథ్యమిస్తే, అప్పుడు భారత్‌ ని ఆవిధంగా బుజ్జగించాలో ఐసీసీ కి సవాలుగా మారింది. దీనికి కారణం గత మూడు సంవత్సరాలుగా బీసీసీఐ, ఐసీసీ మధ్యలో పచ్చ గడ్డి వేస్తే బగ్గు మనీలా ఉంది పరిస్థితి. కాబట్టి ఈ విషయం పై అన్ని దేశాల క్రికెట్ సంఘాలతో చర్చించి వారి తుది నిర్ణయంతో ఐసీసీ ముందుకి పోనుంది. ఏది ఏమైనా కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని తన గుప్పిటలోకి   తీసుకోని విలయ తాండవం చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: