మహేంద్ర సింగ్ ధోని... భారతదేశంలో ఈ పేరు గురించి తెలియని వారు ఉన్నారంటే నిజంగానే అతిశయోక్తి అని చెప్పవచ్చు. దీనికి కారణం ఆయన ప్రతిభ అని చెప్పవచ్చు. నిజానికి అయ్యన మంచితనం గురించి చాలానే విని ఉంటాము. ఇక అసలు విషయానికి వస్తే... కరోనా వ్యాప్తి అరకట్టేందుకు గాను అనేకమంది సెలబ్రెటీలు వారి తోహతకు తగ్గ అమౌంట్ ని స్పాన్సర్ చేస్తున్నారు.  ఇదంతా అలా ఉండగా ధోని ఒక లక్ష రూపాయలు ఒక సొసైటీ నుంచి ఇచ్చారని మీడియాలో కొందరు రాసుకొచ్చారు. అందులోనూ అంత ఆదాయం ఉన్న ధోని కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రం ఇచ్చాడు అని రాసారంట...

 


ఇక అంతే దీనిపై ధోని భార్య మీడియా పై ఒక రేంజ్ లో ట్విట్టర్ ద్వారా వారిని ఏకిపారేసింది. ధోని తను ఎంత ఇచ్చిన తన పేరుని మాత్రం అసలు బయటికి చెప్పనివ్వడు. అలాంటిది ఈ విషయాన్నీ పూర్తిగా తెలుసుకోకుండా ఆయనపై ఇలాంటి వార్తలని రాయడం తప్పు అని రాసుకొచ్చింది. నిజానికి ప్రముఖ ఫండ్ రైసింగ్ సంస్థ మాధ‌వ్‌ ఫౌండేషన్‌కు ధోనీ లక్ష రూపాయల విరాళం అందజేశాడు. అయితే సదరు ఫండ్ రైసింగ్ సంస్థ 12 లక్షల 50 వేల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పింది. కాబట్టి ధోని అందులో ఒక లక్ష ఇచ్చారని చెప్పుకొచ్చింది. ఆమె ట్విటర్ వేదికగా ద్వారా ఇంత విపత్కర కాలంలో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం అవసరమా...? అని మీడియాను  ప్రశ్నించింది...!

మరింత సమాచారం తెలుసుకోండి: