కరోనా వైరస్ దెబ్బకి 2020 సంవత్సరంలో టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌ ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేయడాన్ని భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు స్వాగతించింది. ప్రపంచం మొత్తం నేటి సాయంత్రానికి ఏకంగా ఆరు లక్షల మందికి ఈ వైరస్ పాకంగా, అదే మన భారత్‌ లో ఈ సంఖ్య ఇప్పటికే తొమ్మిది వందల పైకి చేరుకుంది. దీనితో ఒలింపిక్స్ వాయిదా వేయడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ)కి లేకుండా పోయింది. మాములుగా జపాన్‌ దేశంలో టోక్యో వేదికగా జులై 24, 2020 నుంచి ఒలింపిక్స్ జరిగేలా షెడ్యూల్ ఉంది. 

 

 


కాకపోతే కరోనా వైరస్ దెబ్బతో ఈ మెగా టోర్నీకి తమ అథ్లెట్స్‌ ని అసలు పంపబోమని కొన్ని దేశాలు చాలా స్పష్టంగా చెప్పాయి.  దీనితో ఒలింపిక్స్‌ని వాయిదా వేస్తూ ఇటీవల ఐఓసీ తన నిర్ణయాన్ని తెలిపింది. అయితే ఈ విషయం పై పీవీ సింధు మాట్లాడుతూ... ఒలింపిక్స్ వాయిదా తప్పు నిర్ణయం ఏమి కాదు. దీనికి కారణం కరోనా వైరస్ నేపథ్యంలో, ఐఓసీకి మరో ప్రత్యామ్నాయం కూడా లేదు. వారాలు, రోజుల వ్యవధిలోనే కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ పోతుంది. అయితే ఒలింపిక్స్‌ లో ఆడటం నీ కల కదా మరి ఇప్పుడు వాయిదా పడ్డాయి కదా..? అని చాలా మంది  బాధపడుతూ చెప్తున్నారు. కానీ..  పీవీ సింధు  మాత్రం "లైఫ్ ఫస్ట్.. ఆ తర్వాతే ఒలింపిక్స్’’ అని అంటుంది. ఏది ఏమైనా క్రీడా రంగానికి మాత్రం అతి పెద్ద పండుగ ఒలింపిక్స్‌ వాయిదా పడడం నిజంగా భాదకరమైన విషయమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: