సంవత్సరానికి వేల కోట్లు ఆర్జిస్తూ ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రికెట్ బోర్డు గా వెలుగొందుతున్న బీసీసీఐ పై నేటి సాయంత్రం వరకు తీవ్ర స్థాయిలో  విమర్శలు వచ్చాయి. దానికి కారణం కరోనా.. ఈ వైరస్ వల్ల ప్రస్తుతం భారత దేశం లో సంక్షోభం నెలకొన్నసంగతి తెలిసిందే. ఈ సంక్షోభంలో నుండి బయటపడడానికి  కేంద్ర ప్రభుత్వానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తూ అండగా నిలబడుతున్నారు అయితే బీసీసీఐ మాత్రం స్పందించక పోయే సరికి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ విమర్శల వల్లనో ఏమోకానీ ఎట్టకేలకు బోర్డు లో కదలిక వచ్చింది. తాజాగా ప్రైమ్ మినిస్టర్ కేర్ ఫండ్స్ కు 51 కోట్లు విరాళం ఇస్తున్నట్లుగా బోర్డు ప్రకటించింది.  
 
అయితే ఈ విషయంలో  శాంతించిన నెటిజన్లు  టీమిండియా స్టార్ క్రికెటర్లు ధోని, కోహ్లీ లపై మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. కోట్లలో ఆదాయం కలిగిన వీరు ఇప్ఫటిటివరకు విరాళం ప్రకటించకపోవడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి రానున్న రోజుల్లోనైనా వీరిద్దరూ స్థాయికి తగ్గట్లు విరాళం ఇచ్చి అండగా నిలబడతారో లేదోచూడాలి. ఇక భారత క్రికెట్ టీం నుండి మాజీ క్రికెటర్లు సచిన్,గౌతమ్ గంభీర్ లకుతోడు ప్రస్తుత క్రికెటర్లు రైనా, ధావన్ లు విరాళాలు ప్రకటించారు. మరో వైపు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా  విరాళం ప్రకటించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: