వినోదంతోపాటు కాసుల వర్షం కురిపించే టీ 20 క్రికెట్ లీగ్.. ఐపీఎల్ కు దేశంలో వుండే ఆధరణ ఇంతా కాదు. 2008 లో ప్రారంభమైన ఈ లీగ్.. సీజన్ సీజన్ కు ఊహించని రెస్పాన్స్ తెచ్చుకొని సక్సెస్ అవుతూ వచ్చింది దాంతో ఈ ఏడాది జరిగే సీజన్ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి. నిజానికి నిన్నటి నుండే ఐపీఎల్ మ్యానియా మొదలుకావాల్సివుంది కానీ ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని గడ గడ లాడిస్తుండడం ఇండియాలో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండడం తో ఐపీఎల్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. 
 
అయితే  రాబోయే రోజుల్లో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన కూడా ఐపీఎల్ నిర్వహించే పరస్థితి లేదని తెలుస్తుంది. ఎందుకంటే విదేశీ ఆటగాళ్లకు ఇప్పట్లో వీసాలు ఇచ్చే అవకాశం లేదు. ఐపీఎల్ లో విదేశీ ఆటగాళ్ల ప్రాముఖ్యత గురించి చెప్పనవరం లేదు వారు లేకుండా ఒకవేళ సీజన్ ను కొనసాగించిన సక్సెస్ అవ్వడం కష్టమే..దాంతో 13వ సీజన్ ను ఈఏడాది వాయిదా వేసి వచ్చే ఏడాది లో నిర్వహించే ఆలోచనలో ఉన్నామని ఐపీఎల్ పాలక మండలి సభ్యుడు ఒకరు వెల్లడించాడు. ఒక వేళ ఈ సీజన్  వచ్చే ఏడాది జరిగితే  మెగా ఆక్షన్ ఉండదు. కాగా  ఏప్రిల్ 15 తరువాత భారత ప్రభుత్వం అలాగే క్రీడా మంత్రిత్వ శాఖ తో చర్చించి బీసీసీఐ ,ఐపీఎల్ 2020 పై తుది నిర్ణయాన్ని వెల్లడించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: