ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. దీని దెబ్బకు ఇండియా తో సహా చాలా దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి దాంతో ఆయా దేశాలు ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోయాయి. జపాన్ ను కూడా ఈ వైరస్ అతలాకుతులం చేస్తుంది. ఆదివారం వరకు జపాన్ లో 1800 మంది కరోనా వ్యాధి కి గురి కాగా అందులో 55 మందికి పైగా మృత్య వాత పడ్డారు. ఇక జూలై  24 నుండి జపాన్ రాజధాని టోక్యో లో ఒలింపిక్స్ జరగాల్సివుంది. అందుకోసం జపాన్  ఇప్పటికే  భారీ గా ఖర్చు చేసిందికానీ కరోనా వల్ల ఒలింపిక్స్ ను వచ్చే ఏడాదికి వాయిదావేయక తప్పలేదు. దీనిపై ఈ రోజు మరోసారి సమావేశమైన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) ఒలింపిక్స్ కు కొత్త తేది ని ప్రకటించింది. 
 
వచ్చే ఏడాది జూలై 23నుండి ఆగస్టు 8వరకు టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయని ఐఓసీ వెల్లడించింది. కాగా ఒలింపిక్స్ వాయిదాపడడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదిలావుంటే  కరోనా, క్రీడా రంగం పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీని దెబ్బకు ఇప్పటికే జరుగాల్సిన పలు క్రీడా టోర్నీ లు రద్దయ్యాయి. దీని పుణ్యమాని బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ ఐపిఎల్ ను కూడా వాయిదావేయాల్సి వచ్చింది.  మరో రెండు నెలల వరకు అంతర్జాతీయంగా ఎలాంటి క్రీడలను నిర్వహించే పరిస్థితి లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: