కరోనా వల్ల దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో పెద్ద ఎత్తున  ప్రధాన మంత్రి సహాయ నిధికి  సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖలతో పాటు వ్యాపారవేత్తలు కూడా భారీగా విరాళాలు ఇస్తున్నారు. అందులో భాగంగా తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతని సతీమణి ,ప్రముఖ హీరోయిన్ అనుష్క మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధి కి అలాగే ప్రైమ్ మినిస్టర్ కేర్స్ ఫండ్ కు  విరాళాలను ప్రకటించారు అయితే ఎంత మొత్తం లో విరాళం ప్రకటించారో మాత్రం బయటికి చెప్పలేదు. దీనిపై  నెటిజన్లు స్పందిస్తూ ..ఎంత విరాళం ఇచ్చారో చెప్పాలని కోహ్లీ ని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే టీమిండియా మాజీ సారథి ధోని లక్ష రూపాయల విరాళం చేశాడని కొద్దీ రోజుల క్రితం వార్తలు వచ్చాయి. దాంతో అంత పెద్ద క్రికెటర్ కేవలం ఆమాత్రం డొనేట్ చేయడం ఏంటనీ పెద్ద ఎత్తున్న విమర్శలు వచ్చాయి అయితే ఈ వార్తల పై ధోని భార్య సాక్షి స్పందించి నిజాలు తెలుసుకొని రాయాలని మీడియా ను కోరింది. ఇంతకీ నిజంగా ధోని విరాళం ఇచ్చాడా ,అసలు ఇవ్వలేదా అనే విషయం లో మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక విరాళం ఏమో కానీ కరోనా గురించి ప్రజలకు అవగాహన కలిపించడానికి ఇంతవరకు ధోని ఒక్క మెసేజ్ కూడా ఇవ్వలేదు మరి ఇంత సీరియస్ ఇష్యు ఫై ధోని స్పందించకపోవడంతో అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: