పాకిస్థాన్ జట్టు సీనియర్ ఆల్‌ రౌండర్ మహ్మద్ హఫీజ్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సంవత్సరంలో ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబరులో జరగబోతున్న టీ - 20 వరల్డ్‌ కప్ టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ కి వీడ్కోలు చెప్తున్నట్లు హఫీస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశాడు. మహ్మద్ హఫీజ్ పాకిస్థాన్ తరుపున హఫీజ్ మోతంగా ఇప్పటి వరకు 55 టెస్టులు, 218 వన్డేలు, 91 టీ - 20 మ్యాచ్‌ లను ఆడాడు. ఇక అన్ని ఫార్మట్స్ లకు కలిపి మొత్తంగా 12,258 పరుగులు సాధించాడు. 

 

 


ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే ఈ 39 ఏళ్ల పాక్ క్రికెటర్ అన్ని ఫార్మెట్స్ లో కలిపి 246 వికెట్లని పడగొట్టాడు. ఇటీవల PSL లీగ్‌ లో మొత్తం 10 మ్యాచ్ లు ఆడిన మహ్మద్ హఫీజ్ 217 పరుగులు కొట్టాడు. ఇందులో 98 పరుగుల అత్యధికంగా సాధించాడు. దీనితో, అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్ చెప్పినా, PSL లాంటి ప్రైవేట్ టీ - 20 లీగ్స్‌ లో మాత్రం పాల్గొంటానని హఫీజ్ చెప్పుకొచ్చాడు.

 

 

 
అయితే టీ - 20 వరల్డ్‌ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ కి వీడ్కోలు చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నాడు. 2019 సంవత్సరంలో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత పాక్ జట్టుకి కొన్ని నెలలు దూరమైన హఫీజ్ , మళ్లీ ఈ సంవత్సరం మొదట్లో పునరాగమనం చేశాడు. బంగ్లాదేశ్‌ తో జరిగిన టీ - 20 సిరీస్‌ లో ఒక మెరుపు హాఫ్ సెంచరీ చేసి పాక్‌ ని గెలిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: