కొన్ని కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటిది నిర్లక్ష్యంగా ఉంటే గాయాలు జరగవా? ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రమాదవశాత్తు ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌ పేలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ లిటన్‌ దాస్‌ భార్య దేవశ్రీ బిస్వాస్‌ సంచిత గాయపడింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. 

 

అయితే ప్రమాదం జరిగిన రోజు ఆమె ''టీ'' కాచేందుకు వంట గదిలోకి వెళ్లి గ్యాస్‌ ఆన్‌ చేయగా సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది. అయితే ఈ విషయంపై దేవశ్రీ బిస్వాస్‌ సంచిత మాట్లాడుతు ''చావు దగ్గర వరకు వెళ్లి తప్పించుకున్నా. చేతులు అడ్డు పెట్టకుండా ఉండి ముఖమంతా కూడా కాలిపోయి ఉండేది. వంట గదిలో గ్యాస్‌ సిలిండర్‌ ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించండి'' అంటూ చెప్పుకొచ్చారు. 

 

కాగా ఈ ఘటనపై కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్‌‌కు రంధ్రం పడి ఉండంతోనే ఈ ప్రమాదం జరిగింది అని లిటన్ దాస్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. సిలిండర్‌‌కు పడిన రంధ్రం ద్వారా గ్యాస్ లీకైందని దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ఆ సమయంలో సంచిత చేతులకు, శారీరనికి గాయాలయ్యాయని తెలిపారు. కాగా గత ఏడాది లిటన్ సంచితను వివాహం చేసుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: