గత ఏడాది వెస్టిండీస్ తో జరిగిన టీ 20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైని. అక్కడి నుండి దాదాపు ప్రతి సిరీస్ కు ఎంపికవుతూ వస్తున్నాడు ఈ 27 ఏళ్ళ ఆటగాడు. అయితే  కరోనా లేకుంటే ఈపాటికి ఐపీఎల్ తో ఫుల్ బిజీగా ఉండేవాడు సైని. ఐపీఎల్ లో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సైని ఆ జట్టుకు అత్యంత కీలకమైన బౌలర్ గా ఎదిగాడు. ఐపీఎల్ వల్లే టీమిండియా లో చోటు దక్కించుకోగలిగాడు.
 
ఇక  మార్చి 29నుండే ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ ఏప్రిల్ 15వరకు వాయిదాపడింది పైగా లాక్ డౌన్ కూడా ఉండడం తో సైని ఇంట్లోనే జిమ్ ను ఏర్పాటు చేసుకొని కసరత్తులు చేస్తున్నాడు. అందులో భాగంగా అతను సిక్స్ ప్యాక్ ను కూడా  తెచ్చుకున్నాడు. తను జిమ్ చేస్తున్న వీడియో లను సైని తన ఇంస్టా గ్రామ్ లో పోస్ట్ చేయడం తో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. 
 
ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది ఐపీఎల్ ను నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపించడం లేదు. ఏప్రిల్ 15 తరువాత ఐపీఎల్ పై తుది నిర్ణయం తీసుకోనుందని వార్తలు వచ్చాయి కానీ  ఇప్పట్లో ఐపీఎల్ పై చర్చ కు కూడా బీసీసీఐ సుముఖత చూపించడం లేదని సమాచారం. దాంతో ఈఏడాది ఐపీఎల్ దాదాపు రద్దైనట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: