కరోనా వైరస్ ని కట్టడి చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ అమలులోకి తీసుకు వచ్చిన విషయం అందరికీ తెలిసినదే. ఉన్న కొద్ది ఈ వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న తరుణంలో పైగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ వైరస్ ముందు నిలవలేక పోవటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ అమలులో ఉండటంతో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి తరుణంలో ఇంటిలోనే ఉంటున్న ప్రజల కోసం చాలా చానల్స్ తమ చానల్స్ లో పాపులర్ అయిన కార్యక్రమాలను రీ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇటీవల మా టీవీ బిగ్ బాస్ సీజన్ త్రీ ని రే టెలికాస్ట్ చేస్తుండగా మరికొన్ని ఛానల్స్ వివిధ కార్యక్రమాలు మళ్లీ ప్రసారం చేస్తున్నారు.

 

ఇటువంటి తరుణంలో క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్ సమయం అమలులో ఉండటంతో రానున్న రోజుల్లో ఇంటి వద్దే ఉండే క్రికెట్ అభిమానులకు 2000 సంవత్సరం నుండి ఇండియా టీం ఆడిన హైలెట్ మ్యాచ్ లను తిరిగి ప్రచారం చేయనున్నట్లు వెల్లడించింది. మూడు మ్యాచుల హైలెట్స్ .. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 6 వ‌ర‌కు ప్ర‌తిరోజు టెలికాస్ట్ చేస్తామ‌ని పేర్కొంది.

 

వీటిని డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లో వీక్షించ‌వ‌చ్చ‌ని తెలిపింది. టెలికాస్ట్ చెయ్యబోయే హైలెట్ మ్యాచ్ లు 2003 లో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ట్రై-సిరీస్, 2000 లో దక్షిణాఫ్రికా భారత పర్యటన, 2001 లో ఆస్ట్రేలియా భారత పర్యటన (వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ రోజంతా బ్యాటింగ్ చేసి అద్భుత విజ‌యాన్ని అందించిన‌ ప్రసిద్ధ కోల్‌కతా టెస్టుతో సహా).. 2002 లో వెస్టిండీస్ భారత పర్యటన , 2005 లో శ్రీలంక భారత పర్యటన లాంటి సూప‌ర్ మ్యాచ్ లు ఉన్నాయి. దీంతో చాలా మంది క్రికెట్ అభిమానులు ఈ మ్యాచులు చూస్తూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: