ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని విల విలలాడుతుంది. లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. అరలక్షకు పైగా మరణాలు సంబవించాయి. కరోనాని నిర్మూలించేందుకు దేశంలో ఇప్పుడు లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావం పడుతుంది.  అయినా మన ప్రాణాలు ముఖ్యం.. ఇప్పుడు కష్టాలు భరిస్తే భవిష్యత్ ఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విన్నవిస్తున్నాయి.  అయితే పేద ప్రజలకు, సినీ పరిశ్రమలో ఉన్నవారికి దాతలు ముందుకు వచ్చి తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు.

 

పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ తన ఛారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తుంటాడు. కరోనా పంజా విసిరిన నేపథ్యంలో, ఆఫ్రిదీ ఛారిటీకి భారత క్రికెట్ అభిమానులు విరాళాలను ఇవ్వాలని ఇండియన్ క్రికెట్ లెజెండ్స్ యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ కోరారు. దాంతో వారిపై కొంత మంది నెటిజన్లు విమర్శలు గుప్పించారు. తాజాగా దీనిపై పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ అఖ్తర్ స్పందిస్తూ, వారిని విమర్శించడం మానవత్వం కాదని అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం, మతం అనేది ప్రధానం కాదని... మానవత్వమే ముఖ్యమని చెప్పాడు.

 

 ఇప్పుడు అందరూ మానవత్వం చాటుకోవాల్సిన పరిస్థితి అన్నారు.   ఈ విషయాన్ని తాను తొలిసారి చెపుతున్నానని అఖ్తర్ తెలిపాడు. టీవీ షోల ద్వారా ఇండియాలో తాను సంపాదించిన దానిలో 30 శాతం తనతో పాటు పని చేస్తున్నవారికి ఇస్తున్నానని... వీరిలో తన డ్రైవర్ నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు ఉన్నారని చెప్పాడు.  మరోవైపు ముంబైలోని స్లమ్ ఏరియాల్లో ఉన్న పేదలకు అఖ్తర్ సాయం చేశాడు. ముఖాన్ని గుడ్డతో కప్పుకుని వెళ్లిన ఆయన... అక్కడున్న వారికి డబ్బును పంచాడు. భారత్ లో తాను ఎంతో సంపాదిస్తున్నానని.. అందులో కొంత ఇక్కడి ప్రజలకు ఖర్చు చేయడం మానవత్వంలో భాగమేనని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: