ప్రస్తుతం క్రికెట్‌ లో అన్ని రకాల ఫార్మెట్స్ కి సరిపై ఆటగాళ్లలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒకరు. అయితే ఆయన స్పిన్‌ ను స‌మ‌ర్థ‌వంతంగా ఆడ‌గ‌ల‌డ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మిగ‌తా కంగారూ బ్యాట్స్‌ మెన్స్ తో పోలిస్తే స్టీవ్ స్మిత్ ఆట‌తీరు బాగా ఉంటుంది. అయితే అయన ఇటీవల IPL జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్వ‌హించిన ఓ చాట్ షోలో స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. భారత్ లో భార‌త స్పిన్న‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను ఎదుర్కోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించాడు.

 

 

ర‌వీంద్ర జ‌డేజా స‌రైన ప్ర‌దేశాల్లో బంతులు వేస్తాడని, అలాగే అతని లైన్ అండ్ లెంగ్త్ కూడా చ‌క్క‌గా ఉంటుంద‌ని స్టీవ్ స్మిత్ ర‌వీంద్ర జ‌డేజా ని ప్ర‌శంసించాడు. అంతేకాకుండా ఇంకోవైపు అత‌ను వేసే బంతుల్లో విభిన్న‌మైన వేరియేష‌న్లు చూపిస్తాడ‌ని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. ర‌వీంద్ర జ‌డేజా స్థిరమైన ప్ర‌దర్శ‌న‌, మంచి లైన్ అండ్ లెంగ్త్, క‌నీసం ఒక్క వేరియేష‌న్ అయినా ఉంటే ఉప‌ఖండ‌ంలో అలవోకగా రాణించవ‌చ్చ‌ని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: